గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ ఇ-స్కూటర్‌ యాంపీర్‌ నెక్సస్‌

గ్రీవ్స్‌ కాటన్‌ లిమిటెడ్‌కు చెందిన ఇ-మొబిలిటీ విభాగం గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రై.లి. తన ఫ్యామిలీ విద్యుత్‌ స్కూటర్‌ యాంపీర్‌ నెక్సస్‌ను ఆవిష్కరించింది.

Published : 16 Jun 2024 02:52 IST

ధర రూ.1.09 లక్షలు

చెన్నై: గ్రీవ్స్‌ కాటన్‌ లిమిటెడ్‌కు చెందిన ఇ-మొబిలిటీ విభాగం గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రై.లి. తన ఫ్యామిలీ విద్యుత్‌ స్కూటర్‌ యాంపీర్‌ నెక్సస్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.1.09 లక్షలు (ఎక్స్‌-షోరూమ్, చెన్నై). గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రై.లి. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, సీఈఓ కె.విజయ్‌ కుమార్‌ చెన్నైలో ఈ విద్యుత్‌ స్కూటర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని 11 విక్రయ కేంద్రాల్లో ఇ-స్కూటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తమిళనాడు రాణిపేట్‌లోని కంపెనీ ఫ్యాక్టరీలో యాంపీర్‌ నెక్సస్‌ల డిజైన్, అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. 30 శాతం అదనపు బ్యాటరీ లైఫ్‌ దీని సొంతం. జన్‌స్కార్‌ ఆక్వా, ఇండియన్‌ రెడ్, లునార్‌ వైట్, స్టీల్‌ గ్రే రంగుల్లో ఇవి లభ్యమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు