సంక్షిప్త వార్తలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2025 జనవరి-మార్చి)లో క్రెటా విద్యుత్‌ వాహనం (ఈవీ) సహా భవిష్యత్తులో 4 ఈవీ మోడళ్లను తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తెలిపింది.

Published : 18 Jun 2024 03:17 IST

4 ఈవీ మోడళ్లు తీసుకొస్తాం: హ్యుందాయ్‌

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2025 జనవరి-మార్చి)లో క్రెటా విద్యుత్‌ వాహనం (ఈవీ) సహా భవిష్యత్తులో 4 ఈవీ మోడళ్లను తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తెలిపింది. తొలుత ప్రీమియం మోడళ్లు ఆవిష్కరించినా, తదుపరి అందుబాటు ధర ఈవీలను విడుదల చేస్తామంది. ఈవీ మోడళ్ల ధరలను సాధ్యమైనంత అదుపులో ఉంచేందుకు, స్థానికంగా సెల్స్, బ్యాటరీ ప్యాక్‌లు, పవర్‌ ఎలక్ట్రానిక్స్, డ్రైవ్‌ట్రెయిన్‌ వంటి కీలక విడి భాగాలను సమీకరించడంతో పాటు స్థానికంగా ఈవీ సరఫరా వ్యవస్థను నిర్మించేందుకు చూస్తున్నట్లు హ్యుందాయ్‌ వెల్లడించింది. 


గ్లోబల్‌ విండ్‌ ఎనర్జీ కౌన్సిల్‌ ఇండియా ఛైర్‌పర్సన్‌గా గిరీశ్‌ తంతి

దిల్లీ: గ్లోబల్‌ విండ్‌ ఎనర్జీ కౌన్సిల్‌ (జీడబ్ల్యూఈసీ) ఇండియా ఛైర్‌పర్సన్‌గా సుజ్లాన్‌ వైస్‌ ఛైర్మన్‌ గిరీశ్‌ తంతి ఎన్నికయ్యారు. మన దేశం పవన విద్యుదుత్పత్తి, సరఫరా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి అవసరమైన విధివిధానాలు రూపొందించడానికి జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జీడబ్ల్యూఈసీ పనిచేస్తోంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద పవన విద్యుత్తు విపణిగా, సముద్ర తీర గాలితో 46 గిగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా మనదేశం ఎదగడానికి తంతి నాయకత్వం సహకరిస్తుందని జీడబ్ల్యూఈసీ ఇండియా తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని