ఎన్‌ఎండీసీ పరిశోధనా కేంద్రం

ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో నూతన పరిశోధన- అభివృద్ధి కేంద్రాన్ని (ఆర్‌అండ్‌డీ సెంటర్‌) ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని ఎన్‌ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ ప్రారంభించారు.

Published : 19 Jun 2024 02:33 IST

ఎన్‌ఎండీసీ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సంస్థ సీఎండీ అమితవ ముఖర్జీ.

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో నూతన పరిశోధన- అభివృద్ధి కేంద్రాన్ని (ఆర్‌అండ్‌డీ సెంటర్‌) ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని ఎన్‌ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ ప్రారంభించారు. ఖనిజాల ప్రాసెసింగ్, ఉక్కు ఉత్పత్తికి సంబంధించిన అత్యాధునిక ప్రాసెస్‌లపై ఈ కేంద్రంలో పరిశోధనలు నిర్వహించి, వాటిని అమలు చేస్తారని ముఖర్జీ తెలిపారు. ఇందుకోసం ఆటోమేటెడ్‌ మినలర్‌ అనలైజర్, ఎక్స్‌-రే ఫ్లూరోసెన్స్‌ (ఎక్స్‌ఆర్‌ఎఫ్‌) అనలైజర్‌ వంటి అత్యాధునిక సామగ్రిని సమకూర్చుకున్నారు. ప్రధానంగా ‘పెల్లెటైజేషన్‌’ పై ఇక్కడి శాస్త్రవేత్తలు దృష్టి సారిస్తారు. హైడ్రోజన్‌ రిడక్షన్‌ సదుపాయం, మైక్రోవేవ్‌ ఆధారిత హీటింగ్‌ ఫర్నేస్‌ ఉండటం వల్ల, ఉక్కు ఉత్పత్తికి సంబంధించిన పరిశోధనలను అధికంగా చేపట్టే అవకాశం ఈ కేంద్రంలో ఉంది. గత అయిదేళ్లలో పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలపై దాదాపు రూ. 150 కోట్లు వెచ్చించినట్లు అమితవ ముఖర్జీ వెల్లడించారు. 5 దశాబ్దాలుగా దేశంలో ఖనిజాల ప్రాసెసింగ్‌లో ఎన్‌ఎండీసీ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో దిలీప్‌ కుమార్‌ మొహంతీ, వినయ్‌ కుమార్, బి.విశ్వనాధ్‌ తదితర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని