ఫ్రీల్యాండర్‌ బ్రాండ్‌పై చైనాలో విద్యుత్‌ వాహనాల అభివృద్ధి

చైనాలో ఫ్రీల్యాండర్‌ బ్రాండ్‌పై విద్యుత్‌ వాహనాల అభివృద్ధి కోసం భాగస్వామ్య సంస్థ చెరీకి లైసెన్స్‌ ఇవ్వడానికి అంగీకార లేఖపై బుధవారం సంతకం చేసినట్లు టాటా మోటార్స్‌ ఆధీనంలోని జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) తెలిపింది.

Published : 20 Jun 2024 02:49 IST

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ వెల్లడి

దిల్లీ: చైనాలో ఫ్రీల్యాండర్‌ బ్రాండ్‌పై విద్యుత్‌ వాహనాల అభివృద్ధి కోసం భాగస్వామ్య సంస్థ చెరీకి లైసెన్స్‌ ఇవ్వడానికి అంగీకార లేఖపై బుధవారం సంతకం చేసినట్లు టాటా మోటార్స్‌ ఆధీనంలోని జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) తెలిపింది. చెరీ ఈవీ (విద్యుత్తు వాహన) ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకుని అధునాతన విద్యుత్తు వాహనాలను ఫ్రీల్యాండర్‌ పేరుతో సీజేఎల్‌ఆర్‌ (చెరీ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌) సిద్ధం చేయనున్నట్లు జేఎల్‌ఆర్‌ తెలిపింది. ఫ్రీల్యాండర్‌ బ్రాండ్‌ జేఎల్‌ఆర్‌కు చెందిన ల్యాండ్‌ రోవర్‌ వాహనం. దీన్ని 1997-2015 మధ్య ఉత్పత్తి చేశారు. దీని తర్వాత డిస్కవరీ స్పోర్ట్‌ను 2016లో తీసుకొచ్చారు. సీజేఎల్‌ఆర్‌ రూపంలో, ఫ్రీల్యాండర్‌ బ్రాండ్‌పై విద్యుత్‌ వాహనాలు రాబోతున్నాయి. తొలుత చైనాలో ఒక ప్రత్యేకమైన నెట్‌వర్క్‌ ద్వారా విక్రయించి, తర్వాత ప్రపంచ దేశాలకు ఆ వాహనాలను ఎగుమతి చేయాలనే లక్ష్యంతో  సంస్థ ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు