ఎయిరిండియా విమానాల్లో ప్రీమియం ఎకానమీ సీట్లు

ఎంపిక చేసిన దేశీయ విమాన మార్గాల్లో, ప్రీమియం ఎకానమీ సీట్లను వచ్చే నెల నుంచి అందుబాటులోకి తెస్తామని ఎయిరిండియా బుధవారం వెల్లడించింది.

Published : 20 Jun 2024 02:50 IST

ముంబయి: ఎంపిక చేసిన దేశీయ విమాన మార్గాల్లో, ప్రీమియం ఎకానమీ సీట్లను వచ్చే నెల నుంచి అందుబాటులోకి తెస్తామని ఎయిరిండియా బుధవారం వెల్లడించింది. ఎయిరిండియా ఏ320 నియో విమానాల్లో ఈ కొత్త తరగతిని ప్రవేశపెట్టనున్నారు. దేశీయ మార్గాలతో పాటు, తక్కువ దూరం కలిగిన అంతర్జాతీయ మార్గాల్లోనూ కొత్త తరగతి కేబిన్‌ ప్రయాణ అనుభూతి పొందొచ్చని సంస్థ తెలిపింది.  ప్రీమియం ఎకానమీ క్లాస్‌ కోసం రెండు కొత్త ఏ320నియో విమానాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. వీటిలో బిజినెస్‌ క్లాస్‌లో 8 సీట్లు, ప్రీమియం ఎకానమీలో అదనపు లెగ్‌రూమ్‌తో 24 సీట్లు, ఎకానమీ విభాగంలో 132 సీట్లు ఉంటాయి. చిన్న (న్యారో బాడీ) విమానాల్లో ప్రీమియం ఎకానమీ క్యాబిన్‌లను తీసుకొచ్చిన మొదటి సంస్థగా ఎయిరిండియా నిలుస్తోంది. తొలుత దిల్లీ- బెంగళూరు- దిల్లీ, దిల్లీ- చండీగఢ్‌- దిల్లీ మార్గాల్లో ఈ సేవలుంటాయి. వచ్చే ఏడాదికి మొత్తం న్యారో బాడీ విమానాల్లో, మూడు తరగతుల సీట్లను అందుబాటులోకి తేవాలని కంపెనీ భావిస్తోంది. కొత్త విమానాలను ఇందుకనుగుణంగా రూపొందించనుండగా, ప్రస్తుత విమానాల్లో మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం దేశీయ మార్గాల్లో ప్రీమియం ఎకానమీ సీట్లను విస్తారా మాత్రమే అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని