అంకురాల కోసం ఇన్నోవేషన్‌ కేంద్రం: రామ్‌ఇన్ఫో

అంకుర సంస్థలు పూర్తిస్థాయిలో మార్కెట్లో నిలదొక్కుకునేందుకు అవసరమైన మద్దతు అందించేందుకు హైదరాబాద్‌లో ఒకటి, అమెరికాలో 2 ఇన్నోవేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రామ్‌ ఇన్ఫో మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎల్‌.శ్రీనాథ్‌ రెడ్డి బుధవారం ఇక్కడ చెప్పారు.

Published : 20 Jun 2024 02:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: అంకుర సంస్థలు పూర్తిస్థాయిలో మార్కెట్లో నిలదొక్కుకునేందుకు అవసరమైన మద్దతు అందించేందుకు హైదరాబాద్‌లో ఒకటి, అమెరికాలో 2 ఇన్నోవేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రామ్‌ ఇన్ఫో మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎల్‌.శ్రీనాథ్‌ రెడ్డి బుధవారం ఇక్కడ చెప్పారు. హైదరాబాద్‌ కేంద్రంలో ఏడాదికి 15-20 అంకురాలకు స్థానం కల్పిస్తామని వెల్లడించారు. రెండుమూడేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న అంకురాలను ఎంపిక చేసి, ప్రభుత్వంతో కలిసి పనిచేయడంలో, ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యం వహించే అంశాల్లో తోడ్పాటు అందిస్తామన్నారు. అవసరాన్ని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకూ ఆర్థిక సాయాన్ని రుణం లేదా కంపల్సరీ కన్వర్టబుల్‌ డిబెంచర్ల రూపంలో ఇస్తామన్నారు. ఇన్నోవేషన్‌ కేంద్రం పూర్తి స్థాయిలో ఆగస్టు నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అమెరికాలో ప్రముఖ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ఇన్నోవేషన్‌ కేంద్రాలకు సాంకేతికత, మానవ వనరుల సహాయాన్ని హైదరాబాద్‌ కేంద్రం అందిస్తుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 15 రాష్ట్రాలకు విస్తరించడంతో పాటు, రూ.1100 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని