పైన్‌ ల్యాబ్స్‌ రూ.8,300 కోట్ల ఐపీఓ!

డిజిటల్‌ చెల్లింపుల సేవలు అందించే పైన్‌ ల్యాబ్స్, తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా 1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8,300 కోట్లు) సమీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Published : 22 Jun 2024 02:23 IST

దిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల సేవలు అందించే పైన్‌ ల్యాబ్స్, తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా 1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8,300 కోట్లు) సమీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పైన్‌ల్యాబ్స్‌లో పీక్‌ ఎక్స్‌వీ పార్టనర్స్, మాస్టర్‌కార్డ్‌ వంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులు ఉన్నాయి. ఐపీఓ కోసం కంపెనీ విలువను 6 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.50,000 కోట్లు)గా లెక్కకట్టాలన్నది సంస్థ ప్రణాళిక. ఐపీఓలో భాగంగా కంపెనీ తాజా షేర్లతో పాటు, ప్రస్తుత వాటాదార్లు కూడా కొన్ని షేర్లను విక్రయించే అవకాశం ఉంది. స్టాక్‌     ఎక్స్ఛేంజీల్లో నమోదుకు ముందు, ముందస్తు నిధుల సమీకరణకూ సంస్థ ప్రయత్నించొచ్చు. పైన్‌ల్యాబ్స్‌ ఐపీఓకు సంబంధించిన పరిమాణం, విలువ ఇంకా ఖరారు కాలేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. భారత్, పశ్చిమాసియా, ఆగ్నేయాసియాల్లోని 3,700 నగరాల్లో 5,00,000 మంది వర్తకులకు పైన్‌ ల్యాబ్స్‌ సేవలు అందిస్తోంది. కంపెనీ ఖాతాదారుల్లో సోనీ గ్రూప్, బీఎండబ్ల్యూ ఏజీ, శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి.

ఈ ఐపీఓ సాకరమైతే, ఫిన్‌టెక్‌ విభాగంలో పేటీఎం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ ఐపీఓ తర్వాత పైన్స్‌ ల్యాబ్స్‌ ఐపీఓనే పెద్దది కానుంది. 2021లో పేటీఎం ఐపీఓ ద్వారా రూ.18,300 కోట్లు సమీకరించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని