బ్రిటన్‌లో టాటా స్టీల్‌ కార్మికుల సమ్మె

బ్రిటన్‌లో టాటా స్టీల్‌కు చెందిన దాదాపు 1500 మంది కార్మికులు సమ్మెకు దిగనున్నారు. 2800 ఉద్యోగాల కోత, బ్లాస్‌ ఫర్నేస్‌ల మూసివేత వంటి కంపెనీ ప్రణాళికలకు వ్యతిరేకంగా జులై 8 నుంచి వీరు సమ్మె చేయనున్నారు. వేల్స్‌లోని పోర్ట్‌ టాల్‌బోట్, లాన్‌వెర్న్‌ ప్లాంట్‌లకు చెందిన ఉద్యోగులు ఇందులో ఉన్నారు.

Published : 22 Jun 2024 02:25 IST

లండన్‌: బ్రిటన్‌లో టాటా స్టీల్‌కు చెందిన దాదాపు 1500 మంది కార్మికులు సమ్మెకు దిగనున్నారు. 2800 ఉద్యోగాల కోత, బ్లాస్‌ ఫర్నేస్‌ల మూసివేత వంటి కంపెనీ ప్రణాళికలకు వ్యతిరేకంగా జులై 8 నుంచి వీరు సమ్మె చేయనున్నారు. వేల్స్‌లోని పోర్ట్‌ టాల్‌బోట్, లాన్‌వెర్న్‌ ప్లాంట్‌లకు చెందిన ఉద్యోగులు ఇందులో ఉన్నారు. బ్రిటన్‌లో ఉక్కు కార్మికులు సమ్మె చేయనుండటం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారని కార్మిక సంఘాలు తెలిపాయి. సమ్మె కార్యరూపం దాలిస్తే, టాటా స్టీల్‌ బ్రిటన్‌ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. టాటా స్టీల్‌ కార్మికులు తమ ఉద్యోగాల కోసం పోరాడటం లేదని, భవిష్యత్‌ కోసం పోరాడుతున్నట్లు యునైట్‌ జనరల్‌ సెక్రటరీ షారోన్‌ గ్రాహమ్‌ అన్నారు. 

బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా యాక్సిస్‌ బ్యాంక్‌లో 0.5 శాతం వాటాకు సమానమైన 1.7 కోట్ల షేర్లను రూ.2,083 కోట్లకు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ కొనుగోలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని