యులిప్‌లను పెట్టుబడి పథకాలుగా ప్రచారం చేయొద్దు

జీవిత బీమా సంస్థలు అందించే యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ (యులిప్‌)లను పెట్టుబడి పథకాలుగా పేర్కొంటూ ప్రకటనలు జారీ చేయొద్దని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) పేర్కొంది. ఈ మేరకు మాస్టర్‌ సర్క్యులర్‌ను జారీ చేసింది.

Published : 22 Jun 2024 02:26 IST

బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ మార్గదర్శకాలు

దిల్లీ: జీవిత బీమా సంస్థలు అందించే యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ (యులిప్‌)లను పెట్టుబడి పథకాలుగా పేర్కొంటూ ప్రకటనలు జారీ చేయొద్దని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) పేర్కొంది. ఈ మేరకు మాస్టర్‌ సర్క్యులర్‌ను జారీ చేసింది. యూనిట్‌ ఆధారిత, ఇండెక్స్‌ ఆధారిత బీమా పాలసీలను ఇక నుంచి పెట్టుబడి పథకాలుగా ప్రచారం చేయొద్దని బీమా సంస్థలకు సూచించింది. సంప్రదాయ పాలసీలతో పోలిస్తే, మార్కెట్‌ ఆధారిత బీమా పథకాలకు నష్టభయం ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలనీ ఆదేశించింది. పార్టిసిపేటింగ్‌ (బోనస్‌ ఇచ్చే పాలసీలు) ఎండోమెంట్‌ పాలసీలు ఇచ్చే బోనస్‌లకు సంబంధించి ఇచ్చే ఉదాహరణలు వాస్తవం కాదని, ఎలాంటి హామీ ఉండదనీ తెలియజేయాలి. వేరియబుల్‌ యాన్యుటీ పథకాల విషయంలోనూ నష్టభయానికి సంబంధించిన వివరాలతో ప్రకటనలు ఉండాలని పేర్కొంది. యూనిట్‌ ఆధారిత ఫండ్లు లేదా ఇండెక్స్‌ ఫండ్లను కొత్తగా తీసుకొచ్చారా, ఇప్పటికే ఉన్నాయా అనే వివరాలూ ప్రకటనల్లో ఉండాలి. జీవిత బీమా విలువ, అనుబంధ పాలసీల వివరాలు లేకుండా పత్రికా ప్రకటనలూ విడుదల చేయొద్దని మాస్టర్‌  సర్క్యులర్‌లో ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని