జీఎస్‌టీ రేట్ల హేతుబద్దీకరణ కమిటీ పునర్‌వ్యవస్థీకరణ

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్ల హేతుబద్దీకరణ కమిటీని ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. ఏడుగురు సభ్యులుండే ఈ మంత్రుల కమిటీకి కన్వీనర్‌గా బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ ఛౌధ్రిని నియమించింది.

Published : 22 Jun 2024 02:29 IST

కన్వీనర్‌గా బిహార్‌ ఉప ముఖ్యమంత్రి 

దిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్ల హేతుబద్దీకరణ కమిటీని ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. ఏడుగురు సభ్యులుండే ఈ మంత్రుల కమిటీకి కన్వీనర్‌గా బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ ఛౌధ్రిని నియమించింది. జీఎస్‌టీ మండలి కార్యాలయ వెబ్‌సైట్‌ ప్రకారం.. కమిటీలో సభ్యులుగా ఉత్తర ప్రదేశ్‌ ఆర్థిక మంత్రి సురేశ్‌ కుమార్‌ కన్నా, గోవా రవాణా మంత్రి మౌవిన్‌ గోడిన్హో, రాజస్థాన్‌ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్, పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య, కర్ణాటక ఆర్థిక మంత్రి కృష్ణ బైరే గౌడ, కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్‌.బాలగోపాల్‌ ఉండనున్నారు. జీఎస్‌టీ రేట్ల హేతుబద్దీకరణకు సూచనలు, ఇన్వర్టెడ్‌ సుంకం విధానం (అంత్య ఉత్పత్తిపై కంటే ముడి సరకుకు అధిక పన్ను రేట్లు ఉండటం)లో అవసరమైన దిద్దుబాట్లు చేయడం, జీఎస్‌టీ మినహాయింపు జాబితాపై సమీక్ష, జీఎస్‌టీ ఆదాయాన్ని పెంచడం తదితర బాధ్యతలను ఈ కమిటీ నిర్వర్తించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని