జీఎస్‌టీఆర్‌-1 ఫామ్‌ని సవరించే అవకాశం

జీఎస్‌టీ పన్ను చెల్లింపుదార్లు ఇకపై ఒక నెల లేదా త్రైమాసికానికి పన్నులు చెల్లించే ముందు బాహ్య సరఫరా లేదా అమ్మకాల రిటర్న్‌ ఫామ్‌ జీఎస్‌టీఆర్‌-1ని సవరించే అవకాశం ఉంటుంది.

Published : 24 Jun 2024 01:42 IST

సిఫారసు చేసిన జీఎస్‌టీ మండలి

దిల్లీ: జీఎస్‌టీ పన్ను చెల్లింపుదార్లు ఇకపై ఒక నెల లేదా త్రైమాసికానికి పన్నులు చెల్లించే ముందు బాహ్య సరఫరా లేదా అమ్మకాల రిటర్న్‌ ఫామ్‌ జీఎస్‌టీఆర్‌-1ని సవరించే అవకాశం ఉంటుంది. ఇటీవల జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో ఫామ్‌ జీఎస్‌టీఆర్‌-1ఎ ద్వారా కొత్త ఐచ్ఛిక (ఆప్షనల్‌) సదుపాయాన్ని అందించాలని మండలి సిఫారసు చేసింది. పన్ను చెల్లింపుదార్లు పన్ను వ్యవధి కోసం ఫామ్‌ జీఎస్‌టీఆర్‌-1లోని వివరాలను సవరించడానికి లేదా అదనపు వివరాలను ప్రకటించడానికి ఇది వీలు కల్పిస్తుంది. అయితే జీఎస్‌టీఆర్‌-1ఎలో పేర్కొన్న పన్ను వ్యవధి కోసం.. జీఎస్‌టీఆర్‌-3బి రిటర్న్‌ దాఖలు చేయడానికి ముందు ఫైల్‌ చేయాలి. ప్రస్తుతం జీఎస్‌టీ పన్ను చెల్లింపుదార్లు తదుపరి నెల 11వ తేదీలోపు బాహ్య సరఫరా రిటర్న్‌ జీఎస్‌టీఆర్‌-1ని ఫైల్‌ చేస్తున్నారు. రూ.5 కోట్ల వరకు వార్షిక టర్నోవర్‌ ఉన్న పన్ను చెల్లింపుదార్లు మాత్రం త్రైమాసికం ముగిసిన 13 రోజుల్లోపు త్రైమాసిక జీఎస్‌టీఆర్‌-1ని ఫైల్‌ చేస్తున్నారు.

  • 11 రాష్ట్రాల నుంచి కొత్త మంత్రులు ఇటీవల జీఎస్‌టీ మండలిలో చేరినందున, జీఎస్‌టీ మండలి దాని కింద మూడు మంత్రుల బృందాల్ని (జీఓఎం) పునర్నిర్మించాల్సి ఉంది. ఇటీవల జరిగిన 53వ జీఎస్‌టీ మండలి సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, మధ్యప్రదేశ్, మిజోరాం, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ, త్రిపుర రాష్ట్రాల నుంచి 11 మంది కొత్త మంత్రులు హాజరయ్యారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.
  • 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రాలకు జీఎస్‌టీ రాబడి నష్టాన్ని భర్తీ చేయడానికి తీసుకున్న రూ.2.69 లక్షల కోట్ల రుణాలను 2025 నవంబరు నాటికి కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించేందుకు షెడ్యూల్‌ చేసింది. అయితే 4 నెలల ముందే వీటిని తిరిగి చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని