పసిడిలో లాభాల స్వీకరణ!

పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూలంగానే కన్పిస్తున్నప్పటికీ.. లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. అందువల్ల రూ.70,751 దిగువన లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది. రూ.70,890 కంటే దిగువన ట్రేడయితే రూ.70,186; రూ.69,198 వరకు దిద్దుబాటు కావచ్చు.

Published : 24 Jun 2024 01:46 IST

కమొడిటీస్‌ ఈ వారం

పసిడి

పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం సానుకూలంగానే కన్పిస్తున్నప్పటికీ.. లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. అందువల్ల రూ.70,751 దిగువన లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది. రూ.70,890 కంటే దిగువన ట్రేడయితే రూ.70,186; రూ.69,198 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ కాంట్రాక్టు సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,582 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.73,570; రూ.74,274 వరకు కాంట్రాక్టు రాణించే అవకాశం ఉంది. 


వెండి 

వెండి జులై కాంట్రాక్టు ఈవారం రూ.87,376 కంటే దిగువన చలించకుంటే షార్ట్‌ సెల్‌ పొజిషన్లకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఈ స్థాయి కంటే కిందకు వస్తే రూ.85,614; రూ.83,377 వరకు పడిపోవచ్చు. అదేవిధంగా కాంట్రాక్టుకు సానుకూల ధోరణి కొనసాగితే రూ.91,375 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే రూ.93,612; రూ.95,374 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. 


ప్రాథమిక లోహాలు

  • రాగి జులై కాంట్రాక్టు ఈవారం రూ.842.25 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే కొత్తగా లాంగ్‌ పొజిషన్లు జత చేసుకోవచ్చు. అయితే రూ.863.95 వద్ద నిరోధం ఎదురుకావచ్చనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.878 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ కిందకు వస్తే రూ.840.40 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయి కంటే కిందకు వస్తే రూ.830.90; రూ.816.85 వరకు దిద్దుబాటు కావచ్చు. 
  • సీసం జులై కాంట్రాక్టుకు ఈవారం రూ.186.50 కంటే దిగువన కదలాడితే రూ.184.50; రూ.182.30 వరకు పడిపోవచ్చు. అదేవిధంగా రూ.190.75 కంటే ఎగువన చలిస్తే రూ.192.95; రూ.194.95 వరకు రాణించే అవకాశం ఉంటుంది. 
  • జింక్‌ జులై కాంట్రాక్టు ఈవారం రూ.252 కంటే దిగువన ట్రేడయితే దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది. ఒకవేళ సానుకూల ధోరణి కొనసాగితే రూ.263.20 వరకు కాంట్రాక్టు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే రూ.264.75 వద్ద నిరోధం ఎదురవుతుందనే విషయాన్ని ట్రేడర్లు దృష్టిలో ఉంచుకోవాలి. 
  • అల్యూమినియం జులై కాంట్రాక్టును ఈవారం రూ.232 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని షార్ట్‌ సెల్‌ పొజిషన్లను తీసుకోవచ్చు. ఒకవేళ రూ.232.70 కంటే ఎగువన చలిస్తే రూ.235.30; రూ.237.90 వరకు పెరుగుతుందని భావించవచ్చు. 

ఇంధన రంగం

  • ముడి చమురు జులై కాంట్రాక్టు ఈవారం రూ.6,578 కంటే దిగువన ట్రేడయితే రూ.6,410; రూ.6,280 వరకు దిద్దుబాటు కావచ్చు. రూ.6,678 కంటే దిగువకు రానంత వరకు కాంట్రాక్టుకు సానుకూల ధోరణి కొనసాగే అవకాశం ఉంటుంది. రూ.6,876 వరకు రాణించవచ్చు. 
  • సహజవాయువు జులై కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.255.15 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.268.45; రూ.275.60 వరకు పెరుగుతుందని భావించవచ్చు. ఒకవేళ ప్రతికూలంగా కదలాడితే రూ.234.65 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.227.45; రూ.214.15 వరకు దిద్దుబాటు కావచ్చు. 

వ్యవసాయ ఉత్పత్తులు

  • పసుపు ఆగస్టు కాంట్రాక్టుకు ఈవారం రూ.16,830 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయి కంటే కిందకు వస్తే   రూ.16,286; రూ.15,466 వరకు దిగిరావచ్చు. 
  • పత్తి క్యాండీ జులై కాంట్రాక్టు ఈవారం సానుకూలంగా కనిపిస్తోంది. అందువల్ల ధర తగ్గినప్పుడల్లా కొత్తగా లాంగ్‌ పొజిషన్లు జత చేసుకోవడం మంచిది అవుతుంది. 

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని