భారత్‌లో మెటా ఏఐ సేవలు

కృత్రిమ మేధ (ఏఐ) అసిస్టెంట్‌ ‘మెటా ఏఐ’ సేవలను భారత్‌లోనూ అందుబాటులోకి తెచ్చినట్లు సోమవారం మెటా ప్రకటించింది.

Published : 25 Jun 2024 02:10 IST

దిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) అసిస్టెంట్‌ ‘మెటా ఏఐ’ సేవలను భారత్‌లోనూ అందుబాటులోకి తెచ్చినట్లు సోమవారం మెటా ప్రకటించింది. వాట్సాప్, ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, మెటా.ఏఐ పోర్టల్‌పై ఈ సేవలను పొందొచ్చని తెలిపింది. ఈ యాప్స్‌లో ఫీడ్, చాట్స్‌పై ఖాతాదారులు మెటా ఏఐను వినియోగించుకోవచ్చని, యాప్‌ను వీడకుండానే కొత్త అంశాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చని మెటా తెలిపింది. భారత్‌లో ఈ సేవలు ఆంగ్లంలో లభించనున్నాయి. అత్యంత అధునాతన మెటా లామా 3పై మెటా ఏఐను అభివృద్ధి చేశారు. గతేడాది జరిగిన కనెక్ట్‌ సదస్సులో మెటా ఏఐను తీసుకురానున్నట్లు మెటా ప్రకటించింది. ప్రస్తుతం లామా 3తో అభివృద్ధి చేసిన మెటా ఏఐ తాజా వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. మెటా ఏఐ సాయంతో వాట్సాప్‌ గ్రూప్‌ చాట్‌పై సమీపంలోని రెస్టారెంట్‌ల వివరాలు, ప్రయాణంలో చూడదగ్గ ప్రదేశాలు వంటి వాటిని తెలుసుకోవచ్చు. ఫీడ్‌లో ఉన్న అంశానికి సంబంధించి అదనపు సమాచారాన్ని కూడా మెటా ఏఐతో వెతికి తెలుసుకోవచ్చని మెటా వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని