ఝార్ఖండ్‌లో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌

ల్‌ ఇండియా అనుబంధ సంస్థ ఈస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌ (అండర్‌గ్రౌండ్‌ కోల్‌ గ్యాసిఫికేషన్‌-యూసీజీ) ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ఝార్ఖండ్‌లో ప్రారంభించింది.

Published : 25 Jun 2024 02:13 IST

తొలి ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించిన ఈస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌

దిల్లీ: కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ ఈస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌ (అండర్‌గ్రౌండ్‌ కోల్‌ గ్యాసిఫికేషన్‌-యూసీజీ) ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ఝార్ఖండ్‌లో ప్రారంభించింది. యూసీజీ అనేది భూమిలో ఉన్న బొగ్గును ‘మండే వాయువుగా మార్చే’ పద్ధతి. మీథేన్, హైడ్రోజన్, కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్‌ డైఆక్సైడ్‌ వంటి విలువైన వాయువులుగా మారుస్తారు. వీటిని విద్యుత్‌ ఉత్పత్తితో పాటు సింథటిక్‌ నేచురల్‌ గ్యాస్, ఇంధనాలకు రసాయన ఫీడ్‌స్టాక్‌గా, ఎరువులు, పేలుడు పదార్థాలకు, పారిశ్రామిక అప్లికేషన్లకు ఉపయోగించవచ్చు. బొగ్గు మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, ఈస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ అండర్‌గ్రౌండ్‌ కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రయోగాత్మక ప్రాజెక్టును ఝార్ఖండ్‌లోని జామ్తారా జిల్లాలోని కస్తా కోల్‌ బ్లాక్‌లో ప్రారంభించింది. ఇటీవల మొదటి దశలో బోర్‌ హోల్‌ డ్రిల్లింగ్, కోర్‌ టెస్టింగ్‌ ద్వారా సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. రెండో దశలో బొగ్గు గ్యాసిఫికేషన్‌పై దృష్టి సారిస్తారు. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు విజయవంతమైతే, దేశ ఇంధన రంగం పరివర్తనం చెందే అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు