సంక్షిప్త వార్తలు

స్టాక్‌ మార్కెట్లో మోసాలు చేసే వారి గురించి తమకు తెలియజేయాలని మార్కెట్‌ వర్గాలకు సెబీ ఛైర్మన్‌ మాధబి పురి బచ్‌ పిలుపునిచ్చారు.

Updated : 05 Jul 2024 06:36 IST

మోసగాళ్ల వివరాలివ్వండి

సెబీ ఛైర్మన్‌ మాధబి పురి బచ్‌ 

ముంబయి: స్టాక్‌ మార్కెట్లో మోసాలు చేసే వారి గురించి తమకు తెలియజేయాలని మార్కెట్‌ వర్గాలకు సెబీ ఛైర్మన్‌ మాధబి పురి బచ్‌ పిలుపునిచ్చారు. ఇది కూడా మదుపర్ల ప్రయోజనాలను రక్షించడమే అవుతుందని అన్నారు. వ్యవస్థా పరమైన సమస్యగా మారే ముందే, సెబీ కఠిన నిబంధనలు తీసుకు రాకముందే అటువంటి తప్పుడు అంశాలను తమ దృష్టికి తీసుకురావాలని పోర్ట్‌ఫోలియో మేనేజర్లకు సూచించారు. ‘మంచి వారే గెలవాలి. ఏదైనా తప్పు జరుగుతుంటే మీరు మాకు చెప్పండి. ఒక్క సారి ఏదైనా భారీ తప్పిదం జరిగితే, మార్కెట్లపై మదుపర్లకు విశ్వాసం పోతుంది. అదే జరిగితే వారి విశ్వాసాన్ని తిరిగి పొందడానికి చాలా సమయం పడుతుంది. తప్పుచేసే వారిపై బలమైన, కఠిన చర్యలను మేము తీసుకోవాల్సి వస్తుంది. ఈ రెండూ జరగకుండా, వ్యవస్థ పేకమేడలా కుప్పకూలకుండా ఉండాలంటే ముందుగానే మాకు, అటువంటి వారి గురించి సమాచారం ఇవ్వండి’ అని ఆమె పోర్ట్‌ఫోలియో మేనేజర్లకు సూచించారు. 

మెటా థ్రెడ్స్‌కు భారత్‌లో ఆదరణ

దిల్లీ: థ్రెడ్స్‌కు అత్యధిక వినియోగదారులు ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటని, అంతర్జాతీయంగా ఈ యాప్‌కు 1.75 కోట్ల మంది నెలవారీ క్రియాశీల వినియోగదారులు ఉన్నట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా వెల్లడించింది. ఎక్స్‌ (ట్విటర్‌)కు పోటీ ఏడాదిక్రితం థ్రెడ్స్‌ను మెటా తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు