మహిళా పారిశ్రామికవేత్తతో ఈఈఎస్‌ఎల్‌ ఒప్పందం

విద్యుత్తు ఆదా చేసే సాధనాల వినియోగంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త పద్మ వథ్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.

Published : 05 Jul 2024 03:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు ఆదా చేసే సాధనాల వినియోగంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త పద్మ వథ్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు పొదుపు చేసే ఉపకరణాలను ప్రజలకు పెద్దఎత్తున అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన రిటైల్‌ విక్రయ కేంద్రాలను పద్మ వథ్యా ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు ఎస్‌కే ఎలక్ట్రికల్స్‌ అనే సంస్థతో కూడా ఈఈఎస్‌ఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. స్వయం సహాయక బృందం (సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపు) నాయకురాలైన పద్మ వథ్యా దాదాపు 100 మంది మహిళలతో హైదరాబాద్‌లో విద్యుత్తు దీపాల వ్యవస్థను నిర్వహిస్తున్నారు. ఆమె దేశవ్యాప్తంగా ఈఈఎస్‌ఎల్‌తో జట్టుకట్టిన తొలి మహిళా పారిశ్రామికవేత్త కావడం ప్రత్యేకత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని