అన్వితా గ్రూప్‌ రూ.2000 కోట్ల స్థిరాస్తి ప్రాజెక్టు

స్థిరాస్తి సేవల సంస్థ అన్వితా గ్రూప్‌ హైదరాబాద్‌ శివార్లలోని కొల్లూరులో రూ.2,000 కోట్ల విలువైన నూతన గృహ సముదాయ ప్రాజెక్టు ఇవానాను చేపట్టింది.

Published : 05 Jul 2024 03:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్థిరాస్తి సేవల సంస్థ అన్వితా గ్రూప్‌ హైదరాబాద్‌ శివార్లలోని కొల్లూరులో రూ.2,000 కోట్ల విలువైన నూతన గృహ సముదాయ ప్రాజెక్టు ఇవానాను చేపట్టింది. మొత్తం 12.9 ఎకరాల్లో విస్తరించిన గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టు ఇది. రెండు దశల్లో కలిపి 1850 అపార్ట్‌మెంట్లు నిర్మిస్తారు. మొదటి దశలో 15 అంతస్తుల ఎత్తైన భవనాల్లో 450 ఫ్లాట్లు నిర్మిస్తారు. రెండో దశలో 36 అంతస్తుల భవనాల్లో మొత్తం 1400 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తంమీద 36 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలాన్ని అందుబాటులోకి తీసుకువస్తారు. నాలుగు పడక గదులు ఉండే స్కైవిల్లాలు కూడా ఈ టవర్లలో ఉంటాయి. అన్ని రకాలైన అధునాతన సదుపాయాలు సమకూర్చుతామని, 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనేది తమ లక్ష్యమని అన్వితా గ్రూప్‌ సీఎండీ అచ్యుతరావు బొప్పన గురువారం ఇక్కడ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని