ప్యాకేజ్డ్‌ ఆహార వస్తువులపై సమాచారం పెద్ద అక్షరాల్లో..

ప్యాకేజ్డ్‌ ఆహార వస్తువులపై ముద్రించే పోషక సమాచారంలో మార్పులు చేయడానికి ఆహార నియంత్రణాధికార సంస్థ ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) శనివారం ఆమోదం తెలిపింది.

Published : 07 Jul 2024 01:51 IST

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మార్పులు!

దిల్లీ: ప్యాకేజ్డ్‌ ఆహార వస్తువులపై ముద్రించే పోషక సమాచారంలో మార్పులు చేయడానికి ఆహార నియంత్రణాధికార సంస్థ ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) శనివారం ఆమోదం తెలిపింది. మొత్తం ఉప్పు, చక్కెర, శాచురేటెడ్‌ కొవ్వు తదితర అంశాలను పెద్ద అక్షరాల్లో, బోల్డ్‌ ఫాంట్‌లో ఉంచాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను త్వరలోనే జారీ చేసి, వివిధ వర్గాల స్పందనను కోరనుంది. తాజా మార్పుల కోసం ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ (లేబెలింగ్‌ అండ్‌ డిస్‌ప్లే) రెగ్యులేషన్స్, 2020లో సవరణలు చేయడానికి 44వ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ         ఛైర్‌పర్సన్‌ అపూర్వ చంద్ర పేర్కొన్నారు. ‘ఈ సవరణలతో వినియోగదారులు ఆయా ఉత్పత్తుల్లో పోషక విలువల గురించి మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకర నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంద’ని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు