బంధన్‌ బ్యాంక్‌ తాత్కాలిక ఎండీ, సీఈఓగా రతన్‌ కుమార్‌ కేశ్‌

బంధన్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రతన్‌ కుమార్‌ కేశ్‌ తాత్కాలిక ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Published : 07 Jul 2024 01:51 IST

కోల్‌కతా: బంధన్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రతన్‌ కుమార్‌ కేశ్‌ తాత్కాలిక ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. జులై 10 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఎండీ, సీఈఓ, వ్యవస్థాపకుడు చంద్రశేఖర్‌ ఘోష్‌ జులై 9న పదవీ విరమణ చేయనుండడం ఇందుకు నేపథ్యం. కొత్త ఎండీ, సీఈఓ బాధ్యతలు చేపట్టే వరకు లేదా మూడు నెలల కాలం పాటు కేశ్‌ తాత్కాలిక ఎండీ, సీఈఓగా ఉంటారని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు బంధన్‌ బ్యాంక్‌ సమాచారమిచ్చింది. కేశ్‌ నియామకానికి వాటాదార్ల అనుమతి లభించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని