పొదుపు ఖాతాల్లో మరిన్ని సదుపాయాలు: ఐఓబీ

రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ), పొదుపు ఖాతాల (ఎస్‌బీ అకౌంట్‌)పై మరిన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ వెల్లడించారు.

Published : 08 Jul 2024 01:42 IST

చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ), పొదుపు ఖాతాల (ఎస్‌బీ అకౌంట్‌)పై మరిన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ద్వారా ‘ఎస్‌బీ మ్యాక్స్‌’, ‘ఎస్‌బీఐ హెచ్‌ఎన్‌ఐ’ పొదుపు ఖాతాల్లో ఈ సదుపాయాలను పొందొచ్చన్నారు. ఇందువల్ల వివిధ ఛార్జీలు పడవని, రాయితీలు, సులభతర పరిష్కారాలు లభిస్తాయని అజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఖాతాదార్లు రుణ ఖాతా స్టేట్‌మెంట్లను, డిజిలాకర్‌ అప్లికేషన్‌/వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా పొందే వీలునూ బ్యాంక్‌ కల్పిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని