ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌ కట్టడికి ఏడు ప్రతిపాదనలు!

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) ట్రేడింగ్‌ వల్ల అత్యధికులు నష్టపోతున్న నేపథ్యంలో.. చిన్న మదుపర్లను కాపాడటంతో పాటు, నియంత్రణపరమైన ఇబ్బందులను పరిష్కరించేందుకు వచ్చిన 7 ప్రతిపాదనలపై సెబీ నియమించిన...

Published : 08 Jul 2024 01:44 IST

కోల్‌కతా: ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) ట్రేడింగ్‌ వల్ల అత్యధికులు నష్టపోతున్న నేపథ్యంలో.. చిన్న మదుపర్లను కాపాడటంతో పాటు, నియంత్రణపరమైన ఇబ్బందులను పరిష్కరించేందుకు వచ్చిన 7 ప్రతిపాదనలపై సెబీ నియమించిన నిపుణుల బృందం చర్చలు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలో చిన్న మదుపర్లు రక్షణ కోసం తీసుకోవాల్సిన స్వల్పకాల వ్యూహాలను నిపుణులు సిఫారసు చేయనున్నారు. ‘ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌కు సంబంధించి వచ్చిన ఏడు ప్రతిపాదనల వల్ల లాభ నష్టాలపై బృందం చర్చించనుంది. ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలో పదిలో 9 మంది మదుపర్లు నష్టపోతున్నారు. ఈ బృందం చేసే సిఫారసులు సెకండరీ మార్కెట్‌ అడ్వైజరీ కమిటీ దృష్టికి వెళ్తాయి. అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారు’ అని సంబంధిత వ్యక్తులు తెలిపారు. వీక్లీ ఆప్షన్స్, స్ట్రైక్‌ ధరల హేతుబద్ధీకరణ, ఎక్స్‌పైరీ రోజు క్యాలండర్‌ స్ప్రెడ్‌ ప్రయోజనాల తొలగింపు, ఆప్షన్‌ కొనుగోలుదార్ల నుంచి ముందే పూర్తి మొత్తం తీసుకోవడం, పొజిషన్‌ పరిమితులను పర్యవేక్షించడం, లాట్‌ సైజ్‌ పెంపు, ముగింపు దగ్గరగా ఉన్న కాంట్రాక్టుకు మార్జిన్‌ అవసరాలను పెంచడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని