పీ అండ్‌ ఎస్‌ బ్యాంక్‌ 100 కొత్త శాఖలు

ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో మరో 100 శాఖలను తెరిచే ప్రణాళికలో ఉన్నట్లు ప్రభుత్వ రంగ పంజాబ్‌ అండ్‌ సింధ్‌ (పీ అండ్‌ ఎస్‌) బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్వరూప్‌ కుమార్‌ సాహా వెల్లడించారు.

Published : 08 Jul 2024 01:45 IST

ఈ ఆర్థిక సంవత్సరంలో తెరిచే అవకాశం

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో మరో 100 శాఖలను తెరిచే ప్రణాళికలో ఉన్నట్లు ప్రభుత్వ రంగ పంజాబ్‌ అండ్‌ సింధ్‌ (పీ అండ్‌ ఎస్‌) బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్వరూప్‌ కుమార్‌ సాహా వెల్లడించారు. వీటితో కలిపి బ్యాంక్‌ మొత్తం శాఖల సంఖ్య 1,665 అవుతుంది. 100 ఏటీఎం కేంద్రాలనూ జత చేసుకోవాలనుకుంటోంది. వీటితో కలిపి మొత్తం ఏటీఎం కేంద్రాలు 1,135కు పెరుగుతాయి. ‘కొత్త శాఖలను ఉత్తరాదిని మినహాయించి మిగిలిన చోట్ల తెరుస్తాం. ప్రస్తుతం 1,700 మంది బ్యాంకింగ్‌ కరెస్పాండెంట్లు (బీసీ) ఉండగా, ఈ సంఖ్య 4,000కు చేరుకుంటుంది. ఖాతాదార్లకు అనువైన మరిన్ని ఉత్పత్తులను తీసుకురావాలనుకుంటున్నామ’ని సాహా వివరించారు.

రూ.2,000 కోట్ల నిధుల సమీకరణ: మొబైల్‌ యాప్‌ పీఎస్‌బీ యూఎన్‌ఎల్‌సీ సేవలనూ విస్తరిస్తామని వెల్లడించారు. లాభాదాయకత వృద్ధి దిశగా వ్యాపారాన్ని నడిపించేందుకు బ్యాంక్‌ దృష్టి సారిస్తోందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో అర్హులైన సంస్థాగత మదుపర్లకు షేర్లను కేటాయించడం ద్వారా రూ.2,000 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వీటిని వ్యాపార వృద్ధికి వినియోగిస్తామన్నారు. ఇందుకోసం ఆగస్టులో మర్చంట్‌ బ్యాంకర్లను నియమిస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని