27 రంగాల్లో ఉపాధి 3.31% వృద్ధి

వ్యవసాయం, వాణిజ్యం, ఆర్థిక సేవలు తదితర 27 రంగాల్లో ఉపాధి పొందిన వారి సంఖ్య 2022-23లో 3.31% పెరిగి 59.66 కోట్లకు చేరిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.

Published : 09 Jul 2024 02:53 IST

2022-23పై ఆర్‌బీఐ గణాంకాలు 

ముంబయి: వ్యవసాయం, వాణిజ్యం, ఆర్థిక సేవలు తదితర 27 రంగాల్లో ఉపాధి పొందిన వారి సంఖ్య 2022-23లో 3.31% పెరిగి 59.66 కోట్లకు చేరిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. 2021-22లో ఈ 27 రంగాల్లో 57.75 కోట్ల మందికి ఉపాధి లభించింది. మొత్తం భారత ఆర్థిక వ్యవస్థలోని 27 రంగాలకు సంబంధించిన గణాంకాలను ఆర్‌బీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. 1980-81 నుంచి 2022-23 వరకు 27 రంగాల్లోని ఉత్పాదకత వివరాలనూ అందుబాటులో ఉంచింది. వ్యవసాయం, వేట, ఫారెస్ట్రీ, ఫిషింగ్‌లో 2021-22లో 24.82 కోట్ల మంది ఉపాధి పొందగా, 2022-23లో 25.3 కోట్ల మందికి ఉపాధి దొరికింది. నిర్మాణం, వాణిజ్యం, రవాణా, నిల్వ వంటి విభాగాల్లో అత్యధికంగా ఉపాధి లభించింది.


టాటా అంతర్జాతీయ విక్రయాలు 2% పెరిగాయ్‌

దిల్లీ: టాటా మోటార్స్‌ అంతర్జాతీయ విక్రయాలు 2024 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 2% పెరిగి 3,29,847కు చేరాయి. 2023-24 ఇదే కాలంలో కంపెనీ విక్రయాలు 3,22,159గా నమోదయ్యాయి. ఇదే సమయంలో ప్రయాణికుల వాహనాల అంతర్జాతీయ టోకు విక్రయాలు 1% తగ్గి 1,38,682కు పరిమితమయ్యాయి. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ సరఫరాలు 5% పెరిగి 97,755గా నమోదయ్యాయి. టాటా వాణిజ్య వాహనాలు, టాటా దేవూ శ్రేణి వాహనాల అంతర్జాతీయ టోకు విక్రయాలు 6%పెరిగి 93,410గా నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని