రెండు ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్‌ రద్దు: ఆర్‌బీఐ

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్‌ ఫిన్‌సర్వ్‌ ఇండియా అనే ఎన్‌బీఎఫ్‌సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ) రిజిస్ట్రేషన్‌ను భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) రద్దు చేసింది.

Published : 09 Jul 2024 02:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్‌ ఫిన్‌సర్వ్‌ ఇండియా అనే ఎన్‌బీఎఫ్‌సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ) రిజిస్ట్రేషన్‌ను భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) రద్దు చేసింది. ప్రోగ్‌క్యాప్‌ పేరుతో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. దీంతో పాటు ముంబయికి చెందిన పాలీటెక్స్‌ ఇండియా అనే ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సునూ ఆర్‌బీఐ రద్దు చేసింది. జడ్‌2పీ అనే మొబైల్‌ అప్లికేషన్‌తో ‘డిజిటల్‌ లెండింగ్‌’ విభాగంలో పాలీటెక్స్‌ ఇండియా పనిచేస్తోంది. రుణాల జారీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ సంస్థల లైసెన్సులను రద్దు చేసినట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రుణ దరఖాస్తులను పరిశీలించడం, కేవైసీ తనిఖీల నిర్వహణ, రుణాల జారీపై తుది నిర్ణయం తీసుకోవటం వంటి ఎంతో కీలక బాధ్యతలను ఇతర సంస్థలకు ఈ కంపెనీల అప్పగించినట్లు ఆర్‌బీఐ గుర్తించింది. అందువల్ల ఈ రెండు సంస్థల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని