స్పైస్‌జెట్‌ ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రం!

ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్పైస్‌జెట్‌ ఇంకో సమస్యలో చిక్కుకుంది. గత రెండున్నరేళ్లుగా ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్‌) బకాయిలను జమ చేయడంలో సంస్థ విఫలమైందని ఆంగ్ల వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

Published : 09 Jul 2024 02:57 IST

పీఎఫ్‌ బకాయిలూ చెల్లించని వైనం 

దిల్లీ: ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్పైస్‌జెట్‌ ఇంకో సమస్యలో చిక్కుకుంది. గత రెండున్నరేళ్లుగా ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్‌) బకాయిలను జమ చేయడంలో సంస్థ విఫలమైందని ఆంగ్ల వార్తా సంస్థలు పేర్కొన్నాయి. చివరి సారిగా 2022 జనవరిలో 11,581 మంది ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్‌ జమ చేసినట్లు ఈపీఎఫ్‌ఓకు పంపిన ప్రశ్నావళి ద్వారా తెలిసినట్లు సమాచారం. అప్పటి నుంచి  బకాయిల గురించి స్పైస్‌జెట్‌కు నోటీసులు, సమన్లు పంపుతున్నా.. కంపెనీ స్పందించలేదని ఈపీఎఫ్‌ఓ తెలిపింది. ఈ పరిణామంతో స్పైస్‌జెట్‌లో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రతరం కానుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే స్పైస్‌జెట్‌ కంపెనీ షేరు 7.6% నష్టపోయింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే షేరు 86% రాణించినట్లే లెక్క. నిధుల కొరత కారణంగా ఈపీఎఫ్‌ఓ డిపాజిట్ల జమ ఆలస్యమవుతోందని.. జనవరి వేతనాలు కూడా ఆలస్యం అయినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే విమానాలను లీజుకిచ్చిన వారితో వివాదాల్లో స్పైస్‌జెట్‌ చిక్కుకుని ఉంది. లీజుకిచ్చిన వారిలో ముగ్గురు దివాలా పిటిషన్లను దరఖాస్తు చేయడంతో, ఎన్‌సీఎల్‌టీ ఏప్రిల్‌ 18న నోటీసులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని