పాన్‌ వివరాలు సమర్పించండి

డివిడెండ్లపై అధిక మొత్తంలో మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) విధించకుండా, శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) వివరాలు సమర్పించాలని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) తన వాటాదార్లను కోరింది.

Published : 09 Jul 2024 02:58 IST

వాటాదార్లకు ఎల్‌ఐసీ సూచన

హైదరాబాద్‌: డివిడెండ్లపై అధిక మొత్తంలో మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) విధించకుండా, శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) వివరాలు సమర్పించాలని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) తన వాటాదార్లను కోరింది. గత ఆర్థిక సంవత్సరానికి గానూ ఎల్‌ఐసీ రూ.10 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుపై రూ.6 డివిడెండుగా ప్రకటించింది. ఆగస్టు 22న వార్షిక సాధారణ సమావేశంలో దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనుంది. డివిడెండ్‌ కోసం జులై 19ని రికార్డు తేదీగా ఎల్‌ఐసీ ప్రకటించింది. ఆ రోజు వరకు ఎల్‌ఐసీ షేర్లు కలిగి ఉన్న వారికి, సెప్టెంబరు 20 లోపుగా డివిడెండ్‌ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. వాటాదార్లు తమ డిపాజిటరీ పార్టిసిపెంట్ల దగ్గర బ్యాంకు ఖాతా వివరాలను మరోసారి తనిఖీ చేసుకోవాలని, అవసరమైతే వాటిని నవీకరించుకోవాలని ఎల్‌ఐసీ సూచించింది. అదే సమయంలో బ్యాంకు ఖాతాకు పాన్‌ను అనుసంధానం చేసుకోవాలని తెలిపింది. ఒకవేళ బ్యాంకు ఖాతా అందుబాటులో లేకపోతే, అనుమతించిన మార్గాల్లో డివిడెండ్‌ చెల్లిస్తామని పేర్కొంది. వ్యక్తులకు అందే డివిడెండ్‌ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 లోపు ఉంటే, టీడీఎస్‌ ఉండదని పేర్కొంది. ఒకవేళ పాన్‌ పేర్కొనకపోయినా, అది చెల్లకపోయినా (ఆధార్‌-పాన్‌ అనుసంధానం కాకపోతే పాన్‌ చెల్లదు) డివిడెండ్‌పై 20% టీడీఎస్‌ విధించే అవకాశం ఉందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని