గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి ఓలా మ్యాప్స్‌కు మారండి

గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి బయటకు రావాల్సిందిగా దేశీయ డెవలపర్లకు ఓలా వ్యవస్థాపకుడు, సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ సూచించారు. గూగుల్‌ మ్యాప్స్‌ వీడిన వారికి ఏడాది పాటు ఓలా మ్యాప్స్‌ ఉచితంగా అందిస్తామని అన్నారు.

Published : 09 Jul 2024 02:59 IST

దేశీయ డెవలపర్లకు భవీశ్‌ అగర్వాల్‌ సూచన 

దిల్లీ: గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి బయటకు రావాల్సిందిగా దేశీయ డెవలపర్లకు ఓలా వ్యవస్థాపకుడు, సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ సూచించారు. గూగుల్‌ మ్యాప్స్‌ వీడిన వారికి ఏడాది పాటు ఓలా మ్యాప్స్‌ ఉచితంగా అందిస్తామని అన్నారు. క్యాబ్‌/బైక్‌ సేవల కోసం గూగుల్‌ మ్యాప్స్‌కు బదులు ఓలా మ్యాప్స్‌ను ఓలా అభివృద్ధి చేసింది. తమ సంస్థ కార్యకలాపాలను ఇటీవలే ఓలా మ్యాప్స్‌కు మార్చినట్లు ప్రకటించిన భవీశ్‌.. తాజాగా వాటిని భారత డెవలపర్లకు అందించేందుకు ముందుకొచ్చారు. దేశంలో వీధి పేర్లు, పట్టణాల్లో మార్పులు, ట్రాఫిక్‌ వంటి సవాళ్లను పాశ్చాత్య వ్యవస్థలు గుర్తించడంలో విఫలమవుతున్నాయని, ఇటువంటి సమస్యలకు ఓలా మ్యాప్స్‌ పరిష్కారమన్నారు. ఏఐ ఆధారిత భారత్‌ కోసం రూపొందించిన ఆల్గారిథమ్స్, వాహనాల వాస్తవిక డేటా వంటివి ఓలా మ్యాప్స్‌లో ఉన్నాయని తెలిపారు. స్ట్రీట్‌ వ్యూ, ఇండోర్‌ ఇమేజెస్, త్రీడీ మ్యాప్స్, డ్రోన్‌ మ్యాప్స్‌ తదితర ఫీచర్లను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని