హెచ్‌సీఎల్‌ టెక్‌ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రాకు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘షెవెలియర్‌ డె లా లీజియన్‌ డి-హానర్‌’ లభించిందని కంపెనీ తెలిపింది.

Published : 09 Jul 2024 03:00 IST

దిల్లీ: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రాకు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘షెవెలియర్‌ డె లా లీజియన్‌ డి-హానర్‌’ లభించిందని కంపెనీ తెలిపింది. వ్యాపారం, స్థిరత్వానికి ఆమె సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించారని పేర్కొంది. ‘ఈ పురస్కారం స్వీకరించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని ఇది సూచిస్తుంద’ని రోష్ని నాడార్‌ తెలిపారు. హెచ్‌సీఎల్‌ టెక్‌ చాలా కాలం నుంచి ఫ్రాన్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘ఫ్రాన్స్‌లో మా కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నాం. ఫ్రెంచ్‌ వ్యాపారాలు డిజిటల్‌ పరివర్తన దిశగా అడుగులు వేసేందుకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. మా వద్ద ఉన్న వైవిధ్యమైన సేవల పోర్ట్‌ఫోలియోతో వారికి సాయం అందిస్తామ’ని రోష్ని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని