మెర్సిడెస్‌ బెంజ్‌ ప్రారంభ స్థాయి ఈవీలు

మెర్సిడెస్‌ బెంజ్‌ తన ప్రారంభ స్థాయి విద్యుత్‌ వాహనాల (ఈవీల)ను సోమవారం విడుదల చేసింది. ఎస్‌యూవీ ఈక్యూఏ 250 ధర రూ.66 లక్షలు కాగా, కొత్త ఈక్యూబీ 350 ఎస్‌యూవీ (5-సీటర్‌) ధర రూ.77.5 లక్షలు,

Published : 09 Jul 2024 03:03 IST

పరిచయ ధర రూ.66-77.5 లక్షలు

దిల్లీ: మెర్సిడెస్‌ బెంజ్‌ తన ప్రారంభ స్థాయి విద్యుత్‌ వాహనాల (ఈవీల)ను సోమవారం విడుదల చేసింది. ఎస్‌యూవీ ఈక్యూఏ 250 ధర రూ.66 లక్షలు కాగా, కొత్త ఈక్యూబీ 350 ఎస్‌యూవీ (5-సీటర్‌) ధర రూ.77.5 లక్షలు, ఈక్యూబీ 250+ ఎస్‌యూవీ (7 సీటర్‌) ధర రూ.70.90 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంది. ఈక్యూఎస్‌ మేబాక్‌ ఎస్‌యూవీ, ఎలక్ట్రిఫైడ్‌ జీ-క్లాస్‌ మోడళ్లను ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. ‘విద్యుత్‌ ప్రారంభ స్థాయి మోడళ్లê,Á తొలిసారి విలాసవంత కార్లను కొనేవారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది రెండంకెల వృద్ధి సాధించే లక్ష్యంతో పని చేస్తున్నామ’ని కంపెనీ ఎండీ, సీఈఓ సంతోష్‌ అయ్యర్‌ వెల్లడించారు.

6 నెలల్లో 9,262 కార్ల విక్రయం

ఈ ఏడాది తొలి 6 నెలల్లో మెర్సిడెస్‌ బెంజ్‌ 9,262 కార్లను మన దేశంలో విక్రయించింది. 2023 ఇదే కాలంలో 8,528 కార్లను సంస్థ విక్రయించింది. 2024 రెండో అర్ధ భాగంలో 6 కొత్త మోడళ్లను విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని