2023-24లో 4.7 కోట్ల ఉద్యోగాలు: ఆర్‌బీఐ

దేశంలో గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 4.7 కోట్ల కొత్త ఉద్యోగాలు జత కావడంతో.. మొత్తం 27 రంగాల్లో కలిపి ఉద్యోగుల సంఖ్య 64.33 కోట్లకు చేరిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Published : 10 Jul 2024 02:20 IST

ముంబయి: దేశంలో గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 4.7 కోట్ల కొత్త ఉద్యోగాలు జత కావడంతో.. మొత్తం 27 రంగాల్లో కలిపి ఉద్యోగుల సంఖ్య 64.33 కోట్లకు చేరిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023 మార్చి ఆఖరుకు దేశంలో 59.67 కోట్ల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని ఆర్‌బీఐ తన ‘మెజరింగ్‌ ప్రొడక్టివిటీ ఎట్‌ ది ఇండస్ట్రీ లెవెల్‌-ది ఇండియా కేఎల్‌ఈఎంఎస్‌’లో తెలిపింది. టార్న్‌క్విస్ట్‌ అగ్రిగేషన్‌ ఫార్ములా ప్రకారం, 2023-24లో ఉపాధి కల్పనలో వృద్ధి 6 శాతంగా నమోదైందని, 2022-23లో ఇది 3.2 శాతమేనని పేర్కొంది. కేఎల్‌ఈఎంఎస్‌ డేటాబేస్‌ ప్రకారం, 2019-20 చివరకు 53.44 కోట్ల మంది ఉపాధి పొందగా, గత ఆర్థిక సంవత్సరం ఆఖరుకు ఈ సంఖ్య 64.33 కోట్లకు చేరింది. వ్యవసాయం, వేట, ఫారెస్ట్రీ, ఫిషింగ్‌లో 2021-22లో 24.82 కోట్ల మంది ఉపాధి పొందుతుండగా, 2022-23లో ఈ సంఖ్య 25.3 కోట్లకు చేరింది. నిర్మాణం, వాణిజ్యం, రవాణా, నిల్వ తదితర రంగాల్లో 2022-23లో అత్యధికంగా ఉపాధి లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని