45 రోజుల్లో ఎంఎస్‌ఎంఈలకు చెల్లింపుల నిబంధన బడ్జెట్‌లో సడలించొచ్చు!

సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థల (ఎంఎస్‌ఎంఈల) నుంచి పెద్ద కార్పొరేట్లు పొందిన వస్తు, సేవలకు 45 రోజుల్లోగా చెల్లింపులు చేయాలన్న నిబంధనను వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం సడలించొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Published : 10 Jul 2024 02:20 IST

దిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థల (ఎంఎస్‌ఎంఈల) నుంచి పెద్ద కార్పొరేట్లు పొందిన వస్తు, సేవలకు 45 రోజుల్లోగా చెల్లింపులు చేయాలన్న నిబంధనను వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం సడలించొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2023 ఆర్థిక చట్టం ప్రకారం, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 43బిలో కొత్త నిబంధనను (హెచ్‌) ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఎంఎస్‌ఎంఈల సరఫరాలకు పెద్ద కంపెనీలు 45 రోజుల్లోపు చెల్లింపులు చేయని పక్షంలో, ఆ మొత్తాన్ని పన్ను చెల్లించాల్సిన ఆదాయం నుంచి తగ్గించడం కుదరదు. దీంతో కార్పొరేట్‌ సంస్థలు అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే ఈ నిబంధన వల్ల పెద్ద కొనుగోలుదార్లు ఉద్యమ్‌లో నమోదైన ఎంఎస్‌ఎంఈ సరఫరాదార్ల నుంచి కొనుగోళ్లు చేయకుండా ఇతర ఎంఎస్‌ఎంఈలు, ఎంఎస్‌ఎంఈయేతరుల నుంచి కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సెక్షన్‌ 43బి(హెచ్‌) నిబంధననను సడలించాలని ఎంఎస్‌ఎంఈల నుంచే ప్రభుత్వానికి విజ్ఞప్తి వచ్చింది. దీనిపై ఆర్థిక మంత్రి సానుకూలంగా ఉన్నారని, ఈ నిబంధనను సడలించొచ్చని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని