భారత్‌లో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ఎన్‌విడియాతో టైట్‌ భాగస్వామ్యం

థాపర్‌ స్కూల్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ ఏఐ అండ్‌ డేటా సైన్స్‌(టీఎస్‌ఏఏఐ)ను ఏర్పాటు చేసేందుకు ఎన్‌విడియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు థాపర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (టైట్‌) ప్రకటించింది.

Published : 11 Jul 2024 02:11 IST

హైదరాబాద్‌: థాపర్‌ స్కూల్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ ఏఐ అండ్‌ డేటా సైన్స్‌(టీఎస్‌ఏఏఐ)ను ఏర్పాటు చేసేందుకు ఎన్‌విడియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు థాపర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (టైట్‌) ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా ఎన్‌విడియా ఏఐ యూనివర్సిటీ ప్రోగ్రామ్‌ నుంచి టైట్‌కు సాంకేతిక తోడ్పాటు లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వీటిని అందిపుచ్చుకోవడానికి భారత్‌లో ఏఐ ఆధారిత యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. టైట్‌ పటియాలా క్యాంపస్‌లో టీఎస్‌ఏఏఐను టైట్, ఎన్‌విడియా సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. విద్యార్థులు, అధ్యాపకులకు పాఠ్యాంశాలు, పరిశోధన అవకాశాలు, వినూత్న ప్రాజెక్టుల్లో ఏఐ నైపుణ్యాలను ఎన్‌విడియా అందిస్తుంది. ఎన్‌విడియాతో కలిసి ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంపై ఆనందంగా ఉన్నట్లు టైట్‌ డైరెక్టర్‌ పద్మకుమార్‌ నాయర్‌ పేర్కొన్నారు. ఏఐ నైపుణ్యాల కొరతను ఇది తీరుస్తుందని తెలిపారు. భవిష్యత్‌కు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలన్న తమ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని