టాటా స్టీల్‌ కార్బన్‌ బ్యాంకు

కార్బన్‌ డైఆక్సైడ్‌(సీఓ2) ఉద్గారాల విడుదలను తగ్గించడాన్ని ఒక వ్యాల్యూ క్రియేటివ్‌ అసెట్‌గా మార్చి, తిరిగి దానిని భవిష్యత్‌లో కర్బన రహిత చర్యలకు వాడేందుకు కార్బన్‌ బ్యాంక్‌ పేరుతో ఒక వర్చువల్‌ రిపాజిటరీని టాటా స్టీల్‌ ప్రారంభించింది.

Published : 11 Jul 2024 02:14 IST

జమ్‌షెడ్‌పూర్‌: కార్బన్‌ డైఆక్సైడ్‌(సీఓ2) ఉద్గారాల విడుదలను తగ్గించడాన్ని ఒక వ్యాల్యూ క్రియేటివ్‌ అసెట్‌గా మార్చి, తిరిగి దానిని భవిష్యత్‌లో కర్బన రహిత చర్యలకు వాడేందుకు కార్బన్‌ బ్యాంక్‌ పేరుతో ఒక వర్చువల్‌ రిపాజిటరీని టాటా స్టీల్‌ ప్రారంభించింది. వాహనాలు, పరిశ్రమల్లో వాడే వివిధ సంప్రదాయ ఇంధనాల వల్ల హానికారక సీఓ2 విడుదల అవుతుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉక్కు పరిశ్రమ కూడా తన ఉత్పత్తి కార్యకలాపాల కోసం బొగ్గు, ఇతర ఇంధనాలపై ఆధారపడుతుంది. దీంతో పెద్ద మొత్తంలో సీఓ2 విడుదల అవుతోంది. వివిధ ప్రాజెక్టుల నుంచి విడుదల అయ్యే సీఓ2 ఉద్గారాల పరిమాణాన్ని తెలుసుకునేందుకు, నిర్వహణకు ఈ కార్బన్‌ బ్యాంకు ఉపయోగపడనుంది.

‘సీఓ2 ఉద్గారాల విడుదలను తగ్గించడం కేవలం పర్యావరణ లక్ష్యాల కోసం ఉపయోగపడటమే కాకుండా ఆదాయ సృష్టికి దోహదపడతాయి. ఈ ఆదాయాలను తిరిగి డీకార్బనైజేషన్‌ (కర్బన రహిత) చర్యలకూ వాడే వీలుంటుంద’ని టాటా స్టీల్‌ తెలిపింది. ఒకటి లేదా అంతకుమించి ఉత్పత్తి ప్రక్రియలో సీఓ2 ఉద్గారాలను తగ్గించే డీకార్బనైజేషన్‌ ప్రాజెక్టులను తొలుత టాటా స్టీల్‌ గుర్తించనుంది. ఈ ప్రాజెక్టుల నుంచి ఎంత మేర సీఓ2 ఉద్గారాలు తగ్గాయనే విషయాన్ని ఒక స్వతంత్ర ఆడిటర్‌ ఎప్పటిప్పుడు పర్యవేక్షిస్తుంటారు. కంపెనీ సమర్పించే సీఓ2 ఉద్గారాల విడుదల తగ్గిన వివరాలను ఆ ఆడిటర్‌ పరిశీలిస్తుంటారు. ఈ పరిశీలన అనంతరం కార్బన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ను ఆడిటర్‌ జారీ చేస్తారు. దానిని వర్చువల్‌గా కార్బన్‌ బ్యాంకులో డిపాజిట్‌ చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని