4 పీఎస్‌బీల నుంచి కేంద్రానికి రూ.6,481 కోట్ల డివిడెండ్‌

కెనరా బ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్‌తో పాటు 4 ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) నుంచి ప్రభుత్వానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6,481 కోట్ల డివిడెండ్‌ లభించినట్లు ఆర్థిక శాఖ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది.

Published : 11 Jul 2024 02:15 IST

ఎగ్జిమ్‌ బ్యాంక్‌ నుంచి మరో రూ.252 కోట్లు

దిల్లీ: కెనరా బ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్‌తో పాటు 4 ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) నుంచి ప్రభుత్వానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6,481 కోట్ల డివిడెండ్‌ లభించినట్లు ఆర్థిక శాఖ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయా బ్యాంక్‌ల ప్రతినిధులు బుధవారం డివిడెండ్‌ చెక్కులను అందించినట్లు తెలిపింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎండీ, సీఈఓ దేవదత్త చంద్‌ రూ.2,514.22 కోట్ల డివిడెండ్‌ చెక్కును మంత్రికి అందజేశారని వెల్లడించింది. అలాగే కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ    కె.సత్యనారాయణ రాజు రూ.1,838.15 కోట్ల డివిడెండ్‌ చెక్కును, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈఓ రజ్‌నీశ్‌ కర్నాటక్‌ రూ.935.44 కోట్ల డివిడెండ్‌ చెక్కును అందజేశారని పేర్కొంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.1,193.45 కోట్ల డివిడెండ్‌ చెక్కును అందజేయగా, ముంబయికి చెందిన ఆర్థిక సంస్థ ఎగ్జిమ్‌ బ్యాంక్‌ కూడా రూ.252 కోట్ల డివిడెండ్‌ చెక్కును అందించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని