హైదరాబాద్‌ విపణిలోకి ‘రివర్‌’

బెంగళూరుకు చెందిన విద్యుత్తు వాహనాల తయారీ సంస్థ ‘రివర్‌’ తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త శాఖను ఆరంభించింది.

Published : 11 Jul 2024 02:20 IST

తెలంగాణలో తొలి శాఖ ఏర్పాటు
మార్చి నాటికి విజయవాడ, గుంటూరు, విశాఖల్లోనూ శాఖలు

ఇండీ స్కూటర్‌తో అరవింద్‌ మణి

మూసాపేట, న్యూస్‌టుడే: బెంగళూరుకు చెందిన విద్యుత్తు వాహనాల తయారీ సంస్థ ‘రివర్‌’ తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త శాఖను ఆరంభించింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లి జాతీయ రహదారిపై అమోర్‌ ఆసుపత్రి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను సంస్థ సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అరవింద్‌ మణి బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రకరకాల మోడళ్లలో తాము ఇండీ స్కూటర్లను రూపొందించామన్నారు. బెంగళూరులో మా తొలి స్టోర్‌ను ప్రారంభించిన తాము ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి విస్తరించామన్నారు. ‘ఇప్పటి వరకు రూ.560 కోట్లు సమీకరించాం. మార్చి నాటికి విజయవాడ, గుంటూరు, విశాఖలలో కూడా శాఖలు ప్రారంభించనున్నాం. లక్ష వాహనాల విక్రయం అనంతరం రెండో మోడల్‌ను ఆవిష్కరిస్తాం. ఇతర రాష్ట్రాల్లోని వంద నగరాల్లో నెలకొల్పే యోచనలో ఉన్నాం. ఏడాది చివరకు దేశంలోని 50కి పైగా నగరాల్లో; రెండేళ్లలో 100కు పైగా నగరాల్లో విస్తరించాలని భావిస్తున్న’ట్లు తెలిపారు. షోరూం ప్రారంభం సందర్భంగా ముందుగా బుక్‌ చేసుకున్న పలువురు వినియోగదారులకు ఇండీ స్కూటర్లను అందజేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు