వాటర్ ప్రూఫ్ ఫోన్లు ఇంకా ఎందుకు రాలేదు?
చేతిలో మొబైల్ ఫోన్ లేనిదే రోజు గడవని కాలమిది. పరాకుగా ఉన్నప్పుడో, సెల్ఫీ తీసుకుంటున్నప్పుడో, చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడో.. నాజూకైన ఫోన్లు చేతిలోంచి చటుక్కున జారి నీళ్లలో పడటం సర్వ సాధారణం. 39% ఫోన్లు నీటిలో పడి పాడైపోయినట్టు 2018లో చేపట్టిన ఓ సర్వే వెల్లడించింది.
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, మోడళ్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖరీదైన చరవాణులు మార్కెట్లోకి వస్తున్నా... నీటిలో పడగానే ఇట్టే మూగబోతున్నాయి. అసలు నీటి నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే ‘వాటర్‌ప్రూఫ్’ మొబైల్ ఫోన్లను ఎందుకు ఉత్పత్తి చేయలేకపోతున్నారన్నది ఇంకా సమాధానం వెతకాల్సిన సవాలుగానే మిగిలిపోయింది.
స్మార్ట్‌ఫోన్లు నీటిని వికర్షించేలా (వాటర్-రిపెల్లింగ్) చేయడంలో ఉత్పత్తిదారులు కొంతవరకూ విజయం సాధించారు. నీరు సులభంగా చొరబడని (వాటర్-రెసిస్టెంట్) ఫోన్లను తీసుకురాగలిగారు. అలాగని ఇవేమీ ఫోన్ లోపలికి నీరు చేరకుండా 100% అడ్డుకోలేకపోతున్నాయి. నీటిలో పూర్తిగా మునిగిపోయే సందర్భాల్లో చాలామటుకు పనికిరాకుండా పోతున్నాయి. దీంతో నీటి నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించే వాటర్‌ప్రూఫ్ చరవాణుల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది.
తప్పుడు ప్రచారానికి భారీ జరిమానా
తమ ఫోన్లు నీటిలోనూ భేషుగ్గా పనిచేస్తాయంటూ తప్పుడు ప్రచారం చేసిన ఓ దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థకు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు గతవారం సుమారు రూ.75 కోట్ల (14 మిలియన్ డాలర్ల) జరిమానా విధించింది. సముద్రపు నీటిలో పడితే, తమ ఫోన్లలోని ఛార్జింగ్ పోర్టులు తుప్పు పడతాయని, తడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితే పాడవుతాయని ఆ సంస్థ నిజం వెల్లడించింది.
ఆ రేటింగ్‌ను ఎలా కొలుస్తారు?
ఇంగ్రెస్ ప్రొటెక్షన్ (ఐపీ) అనే రేటింగ్ సిస్టం ద్వారా.. ఫోన్లు ధూళి వంటి ఘన పదార్థాలు, నీరు వంటి ద్రవపదార్థాలను వికర్షించే గుణాన్ని కొలుస్తారు. రెండు సంఖ్యలతో ఈ రేటింగ్‌ను సూచిస్తారు. ‘ఐపీ68’ను తీసుకుంటే, ఇందులో ఎడమవైపు సంఖ్య ఘన పదార్థాల నుంచి, కుడివైపు సంఖ్య ద్రవ పదార్థాల నుంచి కల్పించే రక్షణ స్థాయులకు సూచన. ఈ సంఖ్యలు 0 (నో ప్రొటెక్షన్) నుంచి 6/8 (హై ప్రొటెక్షన్) వరకూ రేటింగ్‌ను సూచిస్తాయి. అయితే ఇవి కేవలం ప్రయోగశాల పరీక్ష ఫలితాలను అనుసరించి నిర్ధరించినవే.
నీటి నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలంటే?
ఫోన్లు ధూళిని, నీటిని వికర్షించాలంటే... వాటి ఛార్జింగ్ పోర్టులు, బటన్లు, స్పీకర్లు, కెమెరా, ఫ్లాష్, మైక్రోఫోన్, సిమ్‌కార్డు ట్రే, యూఎస్‌బీ పోర్టులు ఉన్నచోట పూర్తిగా మూసెయ్యాలి. ఇందుకు గ్లూ, టేపు, సిలికాన్ సీల్, రబ్బర్ రింగ్, గ్యాస్కెట్, ప్లాస్టిక్ మెష్ వంటి పదార్థాలను వినియోగించాలి. కొంతవరకూ ఇలా చేస్తున్నా ఫలితం అంతంత మాత్రమే. స్మార్ట్‌ఫోన్‌లోని భాగాలన్నీ ఎంతో సున్నితమైనవి. పెళుసుగా ఉంటాయి. అత్యంత నాజూకైన పెట్టెల్లో వీటిని అమర్చాలి. నీటిని పూర్తిగా వికర్షించేలా రూపొందించాలంటే.. వీటి పరిమాణం పెరుగుతుంది. ధర కూడా 30% వరకూ ఎక్కువవుతుంది. ఒకవేళ ఫోన్‌కి చిన్నపాటి బీట వచ్చినా, ఇక దానికి రక్షణ లేనట్టే!
ప్రయోగాలు ఫలించవచ్చు...
‘‘లేజర్ రైటింగ్ సాంకేతికతతో సర్క్యూట్ వంటి లోపలి పరికరాలతో పాటు బయటి భాగాలకూ సిలికాన్, వాటర్-రెసిస్టెంట్ పూతను వేయడం ద్వారా ఫలితం ఉండొచ్చు. దీనిపై జరుగుతున్న ప్రయోగాలు ఫలించే అవకాశముంది. ఒకవేళ మీ ఫోన్ నీటిలో పడిపోతే వెంటనే దాన్ని బయటకు తీసి, పూర్తిగా ఆరనివ్వాలి. అప్పటివరకూ ఛార్జింగ్ పెట్టకూడదు. వాటర్‌ప్రూఫ్ పౌచ్‌ను వినియోగించడం మేలు’’ అని ఆస్ట్రేలియాలోని సీక్యూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ రితేశ్ చుగ్ పేర్కొన్నారు.
- ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Bumrah : బుమ్రా అసాధారణ బౌలింగ్ యాక్షన్ వల్లే ఎక్కువగా గాయాలు
-
Movies News
Liger: మరికొన్ని గంటల్లో విజయ్ దేవరకొండ ఫ్యాన్ మీట్.. వేదిక మార్చేసిన టీమ్
-
Sports News
Dravid - Taylor : అడవిలో 4000 పులులు .. కానీ ఇక్కడ ద్రవిడ్ మాత్రం ఒక్కడే!
-
India News
RSS chief: యావత్ ప్రపంచం భారత్‌వైపే చూస్తోంది : మోహన్ భగవత్
-
Movies News
Vijay Deverakonda: డేటింగ్ లైఫ్.. ఆమెకు ఇలాంటివి నచ్చవు: విజయ్ దేవరకొండ
-
Politics News
Raghunandan: ఏ చట్టం ప్రకారం మంత్రి కాల్పులు జరిపారు?: రఘునందన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- RRR: ఆస్కార్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది..
- బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)