Credit Recovery: రికవరీ.. ఇష్టం వచ్చినట్లు కుదరదు
ఉదయం 7- రాత్రి 7 గంటల మధ్యే సంప్రదించాలి
ఏజెన్సీ పేరును ఆర్థిక సంస్థలు ఖాతాదార్లకు తెలపాలి
ఈనాడు వాణిజ్య విభాగం
ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామలో.. బాకీ వసూలు కోసం ఇంటికి వచ్చిన బ్యాంకు రికవరీ ఏజెంట్లు తమ కుటుంబాన్ని తూలనాడటంతో ఇంటర్మీడియెట్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సంచలనం కలిగించింది. ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రుణం తీసుకునే వారు, చెల్లించాల్సిన బాధ్యతను మరువకూడదనే బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ‘రుణమొత్తాన్ని ఖాతాదార్ల నుంచి వసూలు చేసుకోవాల్సిన రికవరీ సిబ్బంది కూడా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలి. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే, వారే ఇబ్బంది పడాల్సి వస్తుంద’ని ఒక జాతీయ బ్యాంకు ఉన్నతాధికారి వెల్లడించారు. ‘బ్యాంకింగ్ సేవలకు సంబంధించి ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు’ నిబంధనావళిని 2006లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సభ్య బ్యాంకులతో ఏర్పాటైన స్వతంత్ర సంస్థ ది బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) రూపొందించింది. అయితే బీసీఎస్‌బీఐ లేవనెత్తిన అంశాలన్నీ పర్యవేక్షించే అధికారం/బాధ్యత తనకు ఉన్నందున, ఆ సంస్థను రద్దు చేయాలని ఆర్బీఐ 2021లో సూచించింది. అందువల్ల ప్రస్తుతం ఖాతాదారులు తమ ఇబ్బందులపై బ్యాంకు శాఖ లేదా బ్యాంకింగ్ అంబుడ్స్మన్నే సంప్రదించాలి.
బీసీఎస్‌బీఐ రూపొందించిన నిబంధనావళి ఇలా..
* రుణ రికవరీ ప్రక్రియను ఎప్పుడు చేపడుతున్నామన్న విషయాన్ని బ్యాంకు/ఆర్థిక సంస్థ సంబంధిత ఖాతాదారుకు తెలియజేయాలి. రికవరీ ఏజెన్సీ లేదా ఏజెంట్ పేరును బ్యాంకులు తప్పనిసరిగా తమ రుణ గ్రహీతకు వెల్లడించాలి.
* రుణ గ్రహీతలను ఏజెన్సీ ప్రతినిధులు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల మధ్యే సంప్రదించాలి. సమాచారం ఇవ్వకుండా ఖాతాదారుల వద్దకు వారు వెళ్లకూడదు. అంగీకరిస్తే ఉదయం 9- సాయంత్రం 6 గంటల మధ్యే వెళ్లాలి.
* రికవరీ ఏజెంట్ కలవాలనుకుంటే, ఎక్కడ అనేది ఖాతాదారే నిర్ణయించాలి. అతను/ ఆమె గోప్యతను ఏజెంట్ గౌరవించాలి. వారిని అల్లరి చేసేలా కాకుండా, మర్యాద పూర్వకంగానే వ్యవహరించాలి. ఈ సమావేశం కోసం బ్యాంకు నుంచి అధీకృత లేఖను సదరు ఏజెంట్ తీసుకెళ్లాలి.
* రుణ గ్రహీతను ఫోన్/చిరునామాలో సంప్రదించడం వీలుకాకపోతే, అప్పుడు మాత్రమే అతని/ఆమె స్నేహితులు, బంధువులు, సన్నిహితులను ఏజెంట్ కలవవచ్చు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా, రుణ గ్రహీత తప్పనిసరిగా తన ఫోన్‌నెంబరు/చిరునామా వంటి వివరాలను రుణదాతకు అప్డేట్ చేస్తూ ఉండాలి.
ఆర్బీఐ ప్రకారమూ..
ఒకవేళ రుణగ్రహీత కనుక రుణానికి సంబంధించి ఏదైనా సమస్యను లేవనెత్తితే, అది పరిష్కరించే వరకు బ్యాంకు సంబంధిత రుణ ఖాతాను రికవరీ ఏజెన్సీలకు బదిలీ చేయకూడదు. బ్యాంకు కనుక 30 రోజుల్లోపు ఆ సమస్యను పరిష్కరించలేకపోతే, సంబంధిత రుణ గ్రహీత బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు, వడ్డీ వ్యాపారులు, ఆస్తుల పునర్నిర్మాణ సంస్థలు ఈ మార్గదర్శకాలను పాటించాలి.
ఏజెంట్లు ఇబ్బంది పెడుతుంటే ఇలా చేయాలి
రికవరీ ఏజెంట్లు కాల్ చేసినప్పుడు, ఆ కాల్‌ను మొబైల్ ఫోన్లో రికార్డు చేసి, భద్రపరచాలి. ఒక ఏజెంట్ భయపెడుతున్నా, దుర్భాషలాడుతున్నా.. ఆ విషయమై రుణ గ్రహీత బ్యాంకు/ఆర్థిక సంస్థకు ఫిర్యాదు చేస్తే, విచారణకు సాక్ష్యాలుగా ఈ కాల్ రికార్డింగులు ఉపయోగ పడతాయి.
* అయితే భయం వల్లనో/ మరింత ఇబ్బంది పెడతారనే ఆందోళనతోనో రుణగ్రహీతలు ఇలా ఫిర్యాదు చేయడం లేదు. ఇదే అదనుగా ఏజెంట్లు రెచ్చిపోతున్నారు.
* వినియోగదారుల హక్కుల సంఘాల ప్రకారం.. ఏజెన్సీల దుశ్చర్యలపై ఖాతాదారులు ఫిర్యాదు చేసినా, బ్యాంకు/ఆర్థిక సంస్థ ఏజెంట్‌నే సమర్థిస్తే, తప్పనిసరిగా అంబుడ్స్‌మన్‌ను సంప్రదించాలి. దీనిపై చర్యలు తీసుకునే లోగానే ఇల్లు/కార్యాలయం/దుకాణం వద్దకు వచ్చి ఏజెంట్లు ఇబ్బంది పెట్టినా, ఫోన్లో దుర్భాషలాడినా.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.
యాప్ రుణాలపై అధిక వడ్డీ తప్పదని తెలుసు
వే2న్యూస్ సర్వే
ఈనాడు, హైదరాబాద్: ‘రుణ యాప్’ల ద్వారా రుణాలు తీసుకుంటే అధిక వడ్డీ చెల్లించాల్సి ఉన్నప్పటికీ.. త్వరితంగా, సులభతర నిబంధనలతో అప్పు లభిస్తుండటం రుణగ్రహీతలను ఆకర్షిస్తోంది. ఈ విషయం ‘వే2న్యూస్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. యాప్‌ల ద్వారా లభించే రుణాలపై అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుందనే విషయం తమకు తెలుసని 70 శాతం మంది తెలిపారు. అయితే బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం లేకపోవడం, కఠిన నిబంధనలు లేకపోవడంతోనే ఇటువంటి అప్పులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తీసుకున్న అప్పు చెల్లించలేకపోతే రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారని, ఈ వేధింపులు తట్టుకోలేకపోతున్నా.. ఎవరికి ఫిర్యాదు చేయాలో తమకు తెలియడం లేదని 79 శాతం మంది పేర్కొన్నారు. ఈ సర్వేలో దాదాపు 2 లక్షల మంది పాల్గొన్నారని, ఇందులో 35 శాతం మంది మహిళలేనని సంస్థ వెల్లడించింది. సగం మంది 21- 30 ఏళ్ల మధ్య వయసు గల యువతీ యువకులని పేర్కొంది. ఈ అనుభవాల నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఉన్న విశ్వసనీయ సంస్థల నుంచి మాత్రమే రుణాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rajya Sabha: నీతీశ్ షాక్.. రాజ్యసభలో భాజపాకు ఎఫెక్ట్ ఎంతంటే..?
-
India News
Corbevax: ప్రికాషన్ డోసుగా కార్బెవ్యాక్స్.. కేంద్రం అనుమతి..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Supreme Court: వరవరరావుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
-
General News
AP ECET: ఏపీ ఈసెట్-2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
Sports News
SANJU SAMSON: అందరికీ అవకాశాలు ఇస్తున్నారు.. సంజూకే ఎందుకిలా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Gali Janardhana Reddy: ‘గాలి’ అడిగితే కాదంటామా!