Budget 2023: రైల్వేకు రూ.2.42 లక్షల కోట్లు
కేంద్ర బడ్జెట్లో రైల్వేకు మూలధన కేటాయింపులు ఈసారి రికార్డు స్థాయిలో పెరిగాయి. మునుపెన్నడూ లేనిరీతిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ పద్దు కింద రూ.2.42 లక్షల కోట్లు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఇదో కొత్త రికార్డు
100 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.90,000 కోట్లు
35 హైడ్రోజన్ రైళ్లు, 5 వేల ఎల్‌హెచ్‌బీ పెట్టెల తయారీ
అధునాతనంగా మారనున్న వెయ్యి కోచ్‌లు
కొత్తగా మరో 100 విస్టాడోమ్‌లు
వందేభారత్‌లకు వీలుగా పట్టాల పునరుద్ధరణ
దిల్లీ: కేంద్ర బడ్జెట్లో రైల్వేకు మూలధన కేటాయింపులు ఈసారి రికార్డు స్థాయిలో పెరిగాయి. మునుపెన్నడూ లేనిరీతిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ పద్దు కింద రూ.2.42 లక్షల కోట్లు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2013-14తో పోలిస్తే ఇది 9 రెట్లు అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.లక్ష కోట్లు ఎక్కువ. 2022-23లో రూ.1.40 లక్షల కోట్లు కేటాయించారు. దీనిలో రూ.1.37 లక్షల కోట్లు మూలధన వ్యయం. మిగిలినది రెవెన్యూ వ్యయం. నూతన ఆర్థిక సంవత్సరంలో రవాణా రంగంలో 100 కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టనున్నారు. బొగ్గు, ఎరువులు, ఆహారధాన్యాలు వంటివి ఎక్కడివరకు కావాలంటే అక్కడి వరకు చేరవేయడానికి ఇవి దోహదపడతాయి. రూ.15,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులు సహా రూ.75,000 కోట్లు దీనికి ఖర్చవుతుందని అంచనా. మెట్రో స్టేషన్లను రైల్వేస్టేషన్ ప్రాజెక్టులతో సమీకృతపరచడం సహా వినియోగదారుల సదుపాయాలపై రూ.500 కోట్లు వెచ్చించనున్నారు. రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్‌సఫర్, తేజస్ వంటి ప్రీమియం రైళ్లలో వాడేందుకు వెయ్యి రైలు పెట్టెలను సమూలంగా మార్చి, అధునాతనంగా తీర్చిదిద్దనున్నారు. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే 35 రైళ్లను, ఆటోమొబైల్ పరిశ్రమకు ఉపయోగపడేలా 4,500 నూతన పెట్టెల్ని, 5,000 ఎల్‌హెచ్‌బీ పెట్టెల్ని, 58 వేల వ్యాగన్లను తయారు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. పారదర్శక అద్దాలు ఉండే ఆకర్షణీయ విస్టాడోమ్ కోచ్‌లు మరో 100 తయారు చేయించనున్నారు. వందేభారత్ రైళ్ల సంఖ్యను, వాటి వేగాన్ని పెంచడానికి వీలుగా పట్టాల పునరుద్ధరణకు నిధుల కేటాయింపును గత బడ్జెట్ కంటే దాదాపు రూ.1900 కోట్లు పెంచారు.
మెట్రో ప్రాజెక్టులకు రూ.19,518 కోట్లు
నగరాల్లో మంచి ఆదరణ పొందుతున్న దృష్ట్యా దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల ప్రాజెక్టులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.19,518 కోట్లు కేటాయించారు. 22-23 ఆర్థిక సంవత్సరంలో రూ.19,130 కోట్లు దీనికి కేటాయించినా, సవరించిన అంచనాల్లో రూ.15,628 కోట్లకు తగ్గించారు. వచ్చే ఏడాదికి కేటాయింపుల్లో ఈక్విటీ పెట్టుబడుల రూపంలో రూ.4,471 కోట్లు, రుణాల ద్వారా రూ.1,324 కోట్లు సమీకరిస్తారు. దేశంలో తొలిసారిగా ‘ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థ’ (ఆర్‌ఆర్‌టీఎస్) చేపట్టడానికి ‘జాతీయ రాజధాని ప్రాంత రవాణా సంస్థ’ (ఎన్‌సీఆర్‌టీసీ)కు రూ.3,596 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. గత బడ్జెట్ కంటే ఇది 23% తక్కువ. దిల్లీ- గాజియాబాద్- మేరఠ్ నడవాలో ఈ పనులు చేపడతారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rent a girl friend: అద్దెకు గర్ల్‌ఫ్రెండ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్...
-
India News
దేవుడా.. ఈ బిడ్డను సురక్షితంగా ఉంచు: భూప్రకంపనల మధ్యే సి-సెక్షన్ చేసిన వైద్యులు..!
-
Politics News
AP News: ఎవరి అంతరాత్మ ఎలా ప్రబోధిస్తుందో?.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి
-
Sports News
IND vs AUS: భారత్, ఆసీస్ మూడో వన్డే.. ఆలౌటైన ఆస్ట్రేలియా
-
India News
Modi: JAM-జన్‌ధన్, ఆధార్, మొబైల్.. ప్రపంచానికే ఓ కేస్‌స్టడీ
-
Crime News
Vijayawada: విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న రూ.7.48కోట్ల విలువైన బంగారం పట్టివేత