Locker: లాకర్‌లో నగదు దాస్తున్నారా.. కుదరదిక!
బ్యాంకులో మీకు లాకర్ ఉందా? అందులో నగదు భద్రపర్చాలనుకుంటున్నారా? ఇకముందు అలా కుదరదు.
బ్యాంకులతో వినియోగదారులు కొత్త ఒప్పందం చేసుకోవాలి
రూ.200 స్టాంపు పత్రాలపై నోటరీ చేయించి ఇవ్వాలి
ఆర్‌బీఐ ఆదేశాలు జారీ
డిసెంబరు 31 వరకు గడువు
ఈనాడు, హైదరాబాద్: బ్యాంకులో మీకు లాకర్ ఉందా? అందులో నగదు భద్రపర్చాలనుకుంటున్నారా? ఇకముందు అలా కుదరదు. లాకర్లు ఉన్న వినియోగదారులు బ్యాంకుతో కొత్త అగ్రిమెంటు(ఒప్పందం) చేసుకోవాలని.. ఇందుకు రూ.200 స్టాంపు పత్రాలపై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. నిజానికి కొత్త ఒప్పందాల గడువు జనవరి 1తోనే ముగిసింది. ఒప్పందం చేసుకోని వినియోగదారుల లాకర్లను కొన్ని బ్యాంకులు సీజ్ చేశాయి. చాలామంది ఇంకా ఒప్పందాలు చేసుకోకపోవడంతో.. గడువును డిసెంబరు 31 వరకు ఆర్‌బీఐ పొడిగించింది. ఈ నేపథ్యంలో సీజ్ చేసిన లాకర్లను తిరిగి వినియోగించుకునే సదుపాయం కల్పించాలంటూ అన్ని బ్యాంకులకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఒప్పందాల విషయంలో బ్యాంకులకు దశలవారీగా లక్ష్యాలను పెట్టింది. వచ్చే జూన్ 30కల్లా 50 శాతం, సెప్టెంబరు 30కల్లా 75, డిసెంబరు 31కల్లా 100 శాతం మంది వినియోగదారుల నుంచి పూర్తి చేయాలని స్పష్టం చేసింది. గడువు తేదీ గురించి వినియోగదారులందరికీ తక్షణం సమాచారం పంపాలని అన్ని బ్యాంకులకు సూచించింది. కొత్త ఒప్పందం ప్రకారం లాకర్లలో నగదు దాచుకోకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. లాకర్ కేటాయించే సమయంలో వినియోగదారుల పూర్తి వివరాలను నమోదు చేయాలని బ్యాంకులకు సూచించింది. ఈ సదుపాయం పొందేందుకు ఏటా చెల్లించాల్సిన నిర్వహణ సొమ్మును రాబట్టుకోవడానికి అంతమేర వడ్డీ వచ్చేలా ముందుగానే మొత్తాన్ని డిపాజిట్ చేయమని కొన్ని బ్యాంకు శాఖలు కోరుతున్నాయి. ఉదాహరణకు లాకర్ వార్షిక నిర్వహణకు రూ.1,000 చెల్లించాల్సి ఉంటే.. అంత సొమ్ము రావడానికి కనీసం రూ.2 లక్షల నగదు డిపాజిట్ చేసినవారికే కేటాయిస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన బ్యాంకు మేనేజర్ ఒకరు తెలిపారు. గతంలో లాకర్లు తీసుకున్నవారిలో కొందరు నెలలు, ఏళ్ల తరబడి వాటిని తెరవలేదని.. అలాంటివారు తప్పనిసరిగా కొత్త ఒప్పందం చేసుకోవాలని ఆయన సూచించారు.
నోట్ల కట్టలకు అడ్డకట్ట వేయాలని..
గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో లాకర్ల నుంచి కట్టలు బయటికి తెచ్చి మార్చుకున్నట్లు అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో నగదు విషయంలో లాకర్ల నిబంధనల్లో ఆర్‌బీఐ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. లాకర్లలో నగదు నిల్వలను అరికట్టాలని బ్యాంకులకు స్పష్టంచేసింది. లాకర్లలో ఏమేం దాచుకోవాలి, ఏమేం పెట్టకూడదనే అంశాలను స్పష్టంగా పేర్కొంది.
చిరునామాపై ఖాతాదారులు స్వయం ధ్రువీకరణ ఇవ్వాల్సిందే..
ఖాతాదారుడి నుంచి చిరునామా, ఇతర వివరాలు ఏమీ మారలేదని ‘స్వయం ధ్రువీకరణ పత్రం’(సెల్ఫ్ డిక్లరేషన్) ప్రతి బ్యాంకు తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. ఇందుకు బ్యాంకుకు పిలవాల్సిన అవసరం లేదని.. ఈమెయిల్ ద్వారా లేదా ఏటీఎంలో, రిజిస్టర్డ్ సెల్‌ఫోన్ నంబర్ నుంచి, నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో.. ఇలా ఏదైనా డిజిటల్ విధానంలో సేకరించాలని సూచించింది. చిరునామాలో వివరాలేవి మారినా అందుకు సంబంధించిన ఆధార్, ఓటరు కార్డు తదితర గుర్తింపు పత్రాలను సైతం ఆన్‌లైన్ విధానంలో స్వీకరించి.. కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయాలని సూచించింది. చిరునామా మారిన వివరాల పత్రాలను వినియోగదారులు ఆన్‌లైన్‌లో పంపితే.. రెండు నెలల్లోగా తనిఖీ పూర్తిచేయాలని స్పష్టం చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Raghunandan Rao: ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై రూ.వెయ్యి కోట్ల పరువునష్టం దావా
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
-
World News
Cannes: కేన్స్ వేదికగా ఇరాన్లో మరణశిక్షణలు ఆపాలంటూ మోడల్ నిరసన
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!