సంపద సృష్టికి తోడుగా

జీవిత బీమా పాలసీతోపాటు, పెట్టుబడి వృద్ధిని కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకొని మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ‘స్మార్ట్‌ క్యాపిటల్‌ గ్యారంటీ సొల్యూషన్‌’ను విడుదల చేసింది. ఇది మార్కెట్‌ ఆధారిత పాలసీ.

Updated : 08 Jul 2022 06:55 IST

జీవిత బీమా పాలసీతోపాటు, పెట్టుబడి వృద్ధిని కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకొని మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ‘స్మార్ట్‌ క్యాపిటల్‌ గ్యారంటీ సొల్యూషన్‌’ను విడుదల చేసింది. ఇది మార్కెట్‌ ఆధారిత పాలసీ. వ్యవధి తీరిన తర్వాత చెల్లించిన ప్రీమియాలకు పెట్టుబడి హామీని కల్పించడం ఈ పాలసీ ప్రత్యేకత. పాలసీ నుంచి ఒకేసారి లేదా క్రమం తప్పకుండా/ జీవితాంతం వరకూ ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపులనూ పాలసీదారుడు ఇష్టానుసారం ఎంచుకోవచ్చు. ఈ పాలసీ మ్యాక్స్‌ లైఫ్‌ స్మార్ట్‌ వెల్త్‌ ప్లాన్‌, మ్యాక్స్‌ లైఫ్‌ ఫ్లెక్సీ వెల్త్‌ అడ్వాంటేజ్‌ ప్లాన్‌లలో ఉన్న ప్రయోజనాలను ఒకే గొడుగు కింద అందిస్తుంది. ఈ పాలసీకి చెల్లించిన ప్రీమియానికి సెక్షన్‌ 80సీ కింద మినహాయింపు లభిస్తుంది.


అన్ని రకాల షేర్లలో...

వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తన తొలి ఈక్విటీ పథకాన్ని ఆవిష్కరించింది. దీనిపేరు.. ‘వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌’. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ఈ నెల 12న ప్రారంభమై, 26న ముగుస్తుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.500. మదుపరులకు దీర్ఘకాలంలో సంపదను సృష్టించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు ఫండ్‌ సంస్థ పేర్కొంది. ఇది ఫ్లెక్సీ క్యాప్‌ పథకం కాబట్టి, ఈ పథకం సమీకరించిన మొత్తాన్ని లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన షేర్లలో పెట్టుబడి పెడతారు. ఈ ఫండ్‌ కింద సైక్లికల్‌, కౌంటర్‌-సైక్లికల్‌ రంగాలకు చెందిన కంపెనీలతో బ్యాలెన్స్‌డ్‌ పోర్ట్‌ఫోలియోను నిర్మించనున్నట్లు వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ తెలిపింది. ఈ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ అజమాయిషీలో దేశీయంగా రూ.40వేల కోట్లకు పైగా ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో మరికొన్ని ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను విడుదల చేయబోతున్నట్లు సంస్థ వెల్లడించింది.


రూ.50లక్షల వరకూ...

కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆరోగ్య బీమా రక్షణ కల్పించే పాలసీని ఎంచుకునే వారికోసం యూనివర్సల్‌ సాంపో హెల్త్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంప్లీట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని ప్రవేశ పెట్టింది. కనీసం రూ.4లక్షల నుంచి గరిష్ఠంగా రూ.50 లక్షల వరకూ ఈ పాలసీని ఎంచుకోవచ్చు. 14 ప్రాథమిక, 26 అనుబంధ పాలసీలతో ఇది అందుబాటులో ఉంది. తక్కువ ప్రీమియంతో పాలసీ విలువను పెంచుకొని, వైద్య ఖర్చులను తట్టుకునేందుకు ఇవి తోడ్పడతాయని సంస్థ పేర్కొంది. పాలసీని ఏడాది, రెండు, మూడేళ్ల వ్యవధికి తీసుకోవచ్చు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని