New schemes: ఆరోగ్య సంరక్షణ రంగంలో మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి 2 కొత్త పథకాలు

మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ ఫైనాన్షియల్‌ ఎక్స్‌ బ్యాంక్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌ ప్రధానంగా బ్యాంకింగేతర ఫైనాన్స్‌ కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంది. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 250 లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ టీఆర్‌ఐ సూచీలోని

Updated : 22 Jul 2022 09:47 IST

ఆర్థిక, ఆరోగ్య రంగాల్లోని కంపెనీల్లో మదుపు చేసే విధంగా మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి రెండు కొత్త పథకాలు అందుబాటులోకి వచ్చాయి.

* మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ ఫైనాన్షియల్‌ ఎక్స్‌ బ్యాంక్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌ ప్రధానంగా బ్యాంకింగేతర ఫైనాన్స్‌ కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంది. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 250 లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ టీఆర్‌ఐ సూచీలోని దాదాపు 30 ఫైనాన్స్‌ కంపెనీల షేర్లతో ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. ఈ సూచీలో ప్రస్తుతం హౌసింగ్‌ ఫైనాన్స్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్‌, బీమా, కార్డు చెల్లింపులు, ఫిన్‌టెక్‌ రంగాలకు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఎస్‌బీఐ లైఫ్‌... తదితర కంపెనీలు ఉన్నాయి.  ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 250 లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ టీఆర్‌ఐ సూచీ 15.3 శాతం సీఏజీఆర్‌ (కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌) ను నమోదు చేసింది. మనదేశంలో నగర జనాభా పెరుగుతోంది. ఆ క్రమంలో వినియోగం గణనీయంగా పెరిగి నాన్‌- బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల వ్యాపార పరిమాణం బాగా పెరుగుతుందని అంచనా. ఈ కోవలో చూస్తే ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలపై పెట్టుబడి లాభదాయకమని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పథకాన్ని మోతీలాల్‌ ఓస్వాల్‌ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

* మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ హెల్త్‌కేర్‌ ఈటీఎఫ్‌ పనితీరుకు ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ హెల్త్‌కేర్‌ ఈటీఎఫ్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సూచీలో ఉన్న కంపెనీల నుంచి ఎంపిక చేసిన షేర్లతో పోర్ట్‌ఫోలియో నిర్మిస్తారు. ప్రధానంగా వైద్య సేవల రంగానికి చెందిన కంపెనీలను ఎంచుకుంటారు. ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్లుగా స్వప్నిల్‌ మయేకర్‌, అభిరూప్‌ ముఖర్జీ వ్యవహరిస్తారు. ఈ రెండు ఫండ్లకూ నేటితో ఎన్‌ఎఫ్‌ఓ ముగియనుంది. కనీస పెట్టుబడి రూ. 500. ఇవి ఓపెన్‌ ఎండెడ్‌ కాబట్టి, ఎప్పుడంటే అప్పుడు యూనిట్లను కొనుగోలు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని