స్థిరమైన వృద్ధికి...

మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోను నిర్మించే బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లలోకి మరో కొత్త ఫండ్‌ వచ్చింది. అదే మిరే అసెట్‌ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌. దీని ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 3. కనీస పెట్టుబడి రూ.5,000. నిఫ్టీ 50 హైబ్రీడ్‌ కాంపోజిట్‌ డెట్‌ 50: 50 ఇండెక్స్‌ను

Updated : 29 Jul 2022 05:23 IST

మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోను నిర్మించే బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లలోకి మరో కొత్త ఫండ్‌ వచ్చింది. అదే మిరే అసెట్‌ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌. దీని ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 3. కనీస పెట్టుబడి రూ.5,000. నిఫ్టీ 50 హైబ్రీడ్‌ కాంపోజిట్‌ డెట్‌ 50: 50 ఇండెక్స్‌ను ఈ పథకానికి కొలమానంగా తీసుకుంటారు. ఈ విభాగంలోని ఫండ్లు సాధారణంగా 65 శాతం పెట్టుబడిని ఈక్విటీకి, 35 శాతం పెట్టుబడికి రుణ పత్రాలకు కేటాయిస్తాయి. ఈ తరహా ఫండ్లు అయిదేళ్ల కాలంలో సగటున రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్న విషయం గమనార్హం. రుణ పత్రాల వాటా అధికంగా ఉన్నందున ఇటువంటి ఫండ్లలో నష్టభయం ఆ మేరకు తక్కువగా ఉంటుంది. బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో ఉన్న సౌకర్యాన్ని గుర్తించిన మీదట ఇటీవల కాలంలో మదుపరులు ఈ పథకాలపై మొగ్గు చూపిస్తున్నారు. మూలధన లాభాలకు సంబంధించి ‘ఈక్విటీ ట్యాక్సేషన్‌’ ఉండటం ఈ పథకాలకు ఉన్న మరొక ప్రత్యేకత. మిరే అసెట్‌ మూచ్యువల్‌ ఫండ్‌ ఇప్పటి వరకూ ప్రధానంగా ఈక్విటీ పథకాలకు పరిమితమై ఉంది. డెట్‌, ఈక్విటీతో కూడిన బ్యాలెన్స్‌డ్‌ పథకాన్ని ఆవిష్కరించటం ద్వారా ఈ సంస్థ ఎంతో పెద్దదైన బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ పథకాల విభాగానికి విస్తరించినట్లు అవుతోంది.


దీర్ఘకాలిక మదుపరులకు..

డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి ఒక కొత్త మిడ్‌క్యాప్‌ పథకం అందుబాటులోకి వచ్చింది. ఐడీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 11. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. కంపెనీల్లో ప్రధానంగా అయిదు అంశాలను పరిగణనలోకి తీసుకొని పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను ఈ పథకం కింద సిద్ధం చేస్తారు. అత్యధిక నాణ్యత, వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రధానంగా మిడ్‌క్యాప్‌ పథకం అయినప్పటికీ 35 శాతం వరకూ నిధులను లార్జ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లకు కేటాయించే అవకాశం ఉంది.

మిడ్‌క్యాప్‌ పథకాలు దీర్ఘకాలిక మదుపరులకు అనువుగా ఉంటాయి. ఈ తరగతికి చెందిన కొన్ని కంపెనీలు కాలక్రమంలో లార్జ్‌క్యాప్‌ కంపెనీలుగా మారతాయి. మిడ్‌క్యాప్‌ తరగతికి చెందిన కంపెనీలు అధిక వృద్ధి నమోదు చేసే అవకాశమూ ఉంటుంది. సహజంగానే ఇటువంటి కంపెనీలపై పెట్టుబడులు అధిక లాభాలు కురిపిస్తాయి. కాకపోతే ఎంపిక చేసుకోవటంలో నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇచ్చేంత వరకూ ఎదురుచూడగలిగే ఓపిక ఉండాలి. ఈ పథకాన్ని సచిన్‌ రెలేకర్‌ నిర్వహించనున్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని