ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధ సంస్థల్లో

మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒకేసారి రెండు కొత్త పథకాలు తీసుకొచ్చింది.

Updated : 19 Aug 2022 05:56 IST

మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒకేసారి రెండు కొత్త పథకాలు తీసుకొచ్చింది.

* ‘మిరే అసెట్‌ గ్లోబల్‌ ఎలక్ట్రిక్‌ అండ్‌ అటానమస్‌ వెహికిల్స్‌ ఈటీఎఫ్స్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ మదుపరుల నుంచి సమీకరించిన నిధులను విదేశీ ఈక్విటీ ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌)లలో మదుపు చేస్తుంది. ప్రధానంగా ఎలక్ట్రిక్, అటానమస్‌ వాహనాలను, వాటికి సంబంధించిన టెక్నాలజీ, విడిభాగాలు, మెటీరియల్స్‌ అభివృద్ధి చేసే కంపెనీలపై ఈ పెట్టుబడులు ఉంటాయి.

* ‘మిరే అసెట్‌ గ్లోబల్‌ ఎక్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ కింద గ్లోబల్‌ఎక్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఈటీఎఫ్‌ యూనిట్లు కొనుగోలు చేస్తారు. ఈ రెండు పథకాల ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 30. ఈ రెండు పథకాల్లోనూ కనీస పెట్టుబడి రూ.5,000.

* ఎఫ్‌ఓఎఫ్‌- ఓవర్సీస్‌ అనే తరగతి కిందకు ఈ రెండు పథకాలు వస్తాయి.

* న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్‌ఎక్స్‌ అగ్రశ్రేణి ఈటీఎఫ్‌ సేవల సంస్థ. థీమ్యాటిక్‌ ఈటీఎఫ్‌లలో ఈ సంస్థ 40 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పర్యవేక్షిస్తోంది.

* ఈ రెండు పథకాలను మిరే అసెట్‌ ఈటీఎఫ్‌ ఉత్పత్తుల విభాగం హెడ్‌- సిద్ధార్థ్‌ శ్రీవాస్తవ నిర్వహిస్తారు.

* ఏఐ ఎఫ్‌ఓఎఫ్‌కు బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ అయిన ఆర్టిఫిషియల్‌ అండ్‌ బిగ్‌ డేటా ఇండెక్స్‌ (ఐఐక్యూ ఇండెక్స్‌)లో 20 రకాలైన పారిశ్రామిక విభాగాలకు చెందిన 83 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల మార్కెట్‌ విలువ (మార్కెట్‌ కేపిటలైజేషన్‌) దాదాపు 13.2 ట్రిలియన్‌ డాలర్లు.

* ఏఐక్యూ ఇండెక్స్‌ గత ఏడేళ్ల కాలంలో 20.4 శాతం ప్రతిఫలాన్ని ఆర్జించింది.

* ప్రపంచ మార్కెట్లలో నూతన టెక్నాలజీ విభాగాలకు చెందిన కంపెనీలపై పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి ఉన్న మదుపరులు ఈ పథకాలను పరిశీలించవచ్చు.


గృహ నిర్మాణ రంగంలో..

దేశీయంగా గృహ నిర్మాణ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకొని, మదుపరులకు లాభాలు ఆర్జించే వ్యూహంతో టాటా మ్యూచువల్‌ ఫండ్‌ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. టాటా హౌసింగ్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ అనే ఈ పథకం సెక్టోరియల్‌/థీమ్యాటిక్‌ విభాగం కిందకు వస్తుంది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 29. కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకానికి తేజస్‌ గుట్కా ఫండ్‌ మేనేజర్‌. ‘నిఫ్టీ హౌసింగ్‌ ఇండెక్స్‌’తో ఈ పథకం పనితీరును పోలుస్తారు.

ప్రధానంగా నిర్మాణ సామగ్రి.. అంటే సిమెంటు, స్టీలు, రంగులు, టైల్స్, విద్యుత్తు ఉపకరణాలు, ప్లంబింగ్‌ మెటీరియల్, బాత్‌రూమ్‌ ఉపకరణాలు ఉత్పత్తి చేసే కంపెనీలతో పోర్ట్‌ఫోలియోను రూపొందిస్తారు. ఇందులోనూ ‘బాటమ్‌ అప్‌ స్టాక్‌ సెలక్షన్‌’ విధానాన్ని అనుసరిస్తారు. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని