సూచీ ఫండ్లను ఎంచుకుంటున్నారా?
స్టాక్ మార్కెట్లో ఎన్నో కంపెనీలుంటాయి. వాటిలో మంచి పనితీరున్న వాటిని ఎంచుకోవడం అంత తేలికకాదు. కానీ, మార్కెట్ వృద్ధిని ప్రతిబింబించే సూచీల్లో ఉండే షేర్లలో మదుపు చేస్తే.. లాభాలను ఆర్జించడం సులువవుతుంది. పైగా పెట్టుబడుల నిర్వహణలోనూ
స్టాక్ మార్కెట్లో ఎన్నో కంపెనీలుంటాయి. వాటిలో మంచి పనితీరున్న వాటిని ఎంచుకోవడం అంత తేలికకాదు. కానీ, మార్కెట్ వృద్ధిని ప్రతిబింబించే సూచీల్లో ఉండే షేర్లలో మదుపు చేస్తే.. లాభాలను ఆర్జించడం సులువవుతుంది. పైగా పెట్టుబడుల నిర్వహణలోనూ పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఈ వ్యూహంతో వచ్చిన ఫండ్లే ఇండెక్స్ ఫండ్లు (సూచీ ఫండ్లు). ఇప్పుడు దాదాపు అన్ని ఫండ్ సంస్థలూ ఇండెక్స్ ఫండ్లను తీసుకొస్తున్నాయి. సూచీల్లో ఉండే షేర్ల వెయిటేజీ నిష్పత్తి ఆధారంగా ఈ ఫండ్లు ఆయా షేర్లలో మదుపు చేస్తాయి. కాబట్టి, సూచీల లాభాలను నేరుగా అందించేందుకు వీలవుతుంది.
ఫండ్లు ఏ సూచీల ఆధారంగా పనిచేస్తాయనేది ముందుగానే నిర్ణయిస్తారు. ఉదాహరణకు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ విడుదల చేస్తే.. ఆ సూచీలో ఉండే షేర్లలోనే అది మదుపు చేస్తుందన్నమాట. ఈ తరహా ఫండ్లలో మదుపు చేయడం వల్ల ఉన్న ప్రయోజనాలను గమనిస్తే..
* మార్కెట్లో అన్ని రకాల క్యాపిటలైజేషన్ ఉన్న షేర్లలో మదుపు చేసేందుకు ఇండెక్స్ ఫండ్లు దోహదం చేస్తాయి. బీఎస్ఈ 500 ఇండెక్స్ లేదా నిఫ్టీ 100 ఇండెక్స్.. ఇలా మదుపరులు తమకు నచ్చిన సూచీ ఫండ్లను ఎంచుకోవచ్చు. దీనివల్ల వైవిధ్యానికి వీలు కలుగుతుంది. ఈక్విటీలే కాకుండా.. స్థిరాదాయం అందించే సురక్షిత పథకాలకు సంబంధించిన సూచీ ఫండ్లూ ఉంటాయి. ఇవి ప్రధానంగా ప్రభుత్వ సెక్యూరిటీలు, టి-బిల్లులు, కార్పొరేట్ బాండ్లు, కమర్షియల్ పేపర్లు ఇలా పలు రకాల విభాగాల్లో మదుపు చేస్తుంటాయి. ఒక సూచీలో ఏ తరహా పెట్టుబడి పథకాలుంటాయన్నది మార్కెట్ నియంత్రణ సంస్థ చాలా స్పష్టమైన విధివిధానాలను రూపొందించింది.
* సాధారణ మ్యూచువల్ ఫండ్ పథకాలతో పోలిస్తే.. వీటిలో ఖర్చుల నిష్పత్తి తక్కువగా ఉంటుంది. అందుకే, ఈ ఫండ్లకు ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతోందని చెప్పొచ్చు. పెట్టుబడులు ఆయా ప్రామాణిక సూచీల్లోని షేర్లలోనే ఉంటాయి కాబట్టి, ఫండ్ మేనేజర్ పాత్ర తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఫీజు, ఇతర నిర్వహణ ఖర్చులు తక్కువే ఉంటాయి.
* ఫండ్ పెట్టుబడి కోసం ఏయే షేర్లను ఎంచుకుంటుందనే విషయం పూర్తి పారదర్శకంగా ఉంటుంది. పెట్టుబడులు ఎంత మేరకు వృద్ధి సాధించాయి అనేదీ సులువుగా తెలుసుకోవచ్చు. ఏయే షేర్లకు ఎంత పెట్టుబడిని కేటాయించిందీ మదుపరులకు తేలిగ్గా అర్థం అవుతుంది.
* మహమ్మారి తర్వాత ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్, వినియోగ వస్తువులు, టెక్నాలజీ సంస్థలు మంచి వృద్ధిని సాధించాయి. ఈ రంగాల్లోని వృద్ధిని అందుకునేందుకు మదుపరులు బ్యాంకింగ్ ఇండెక్స్, కన్సంప్షన్ ఇండెక్స్, టెక్నాలజీ ఇండెక్స్ తదితర ఫండ్లను ఎంచుకోవచ్చు. ఈ ఫండ్లు మార్కెట్లోని పలు షేర్లలో మదుపు చేస్తాయి కాబట్టి, మదుపరుల పెట్టుబడి పెరిగేందుకు వీలవుతుంది.
* సంప్రదాయ సూచీలకు భిన్నంగా కొత్త ప్రామాణిక సూచీలను తీసుకొచ్చేందుకూ ఫండ్ మేనేజర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న కొన్ని థీమ్యాటిక్ సూచీలను మన దేశంలోనూ ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆశాజనకంగా కనిపిస్తున్న రంగాల్లో పని చేస్తున్న కంపెనీలతో సూచీలను ఏర్పాటు చేసి, ఇండెక్స్ ఫండ్లను తీసుకొస్తున్నారు.
- అశ్విన్ పత్ని, హెడ్-ప్రొడక్ట్స్, యాక్సిస్ ఏఎంసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
PPF vs VPF: పీపీఎఫ్, వీపీఎఫ్‌లో ఏది బెటర్..?
PPF or VPF: వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాల్ని పరిశీలించాక మీ నిర్ణయం తీసుకోండి.. -
Foreign Trip: విదేశీ టూర్‌ను ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి?
విదేశీ వెకేషన్‌ను ప్లాన్ చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం ఇబ్బంది లేకుండా, సజావుగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. -
Claim Ratio: ఆరోగ్య బీమా కంపెనీల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో వివిధ బీమా సంస్థలకు సంబంధించి.. ఆరోగ్య బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
పన్ను ఆదా ఇలా చేద్దాం
ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వచ్చేసింది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు తమ పొదుపు,పెట్టుబడులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. -
డెట్ ఫండ్లలో మదుపు చేస్తున్నారా?
ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తుండటంతో చాలామంది సురక్షిత పథకాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిలో మదుపు చేసేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలను తెలుసుకుందాం. -
Credit cards: క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!
Credit Cards: క్రెడిట్ కార్డుల విషయంలో ఏప్రిల్ 1 నుంచి మార్పులు రానున్నాయి. రివార్డులు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో బ్యాంకులు కీలక మార్పులు చేపట్టాయి. -
Health Insurance Claims: ఆరోగ్య బీమా క్లెయిమ్ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!
Insurance claims: ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు కొన్నిసార్లు తిరస్కరణకు గురవుతుంటాయి. కాబట్టి ఈ తప్పులు చేయొద్దు.. -
Health Emergency: ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి?
జీవితంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కోడానికి మనం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి.. -
Mutual Funds: మ్యూచువల్ ఫండ్ల ఉపసంహరణ సమస్య.. ఎన్ని రోజులు పడుతోందంటే?
మార్కెట్లలో మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్లలో ఉన్న తమ నిధులను మదుపుదార్లు ఉపసంహరించుకున్నప్పుడు నిధుల బదిలీకి వివిధ సంస్థలు కొంత సమయాన్ని తీసుకుంటున్నాయి. ఎంత మొత్తం ఉపసంహరణకు.. ఎంత సమయం తీసుకుంటున్నాయో ఇక్కడ చూడండి. -
Insurance Agent: బీమా ఏజెంట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి?
చాలా మందికి వారి వ్యక్తిగత జీవితంలో బీమా చాలా అవసరం. పాలసీ కొనుగోలు సమయంలో ఏజెంట్/అడ్వైజర్ అవసరం పడొచ్చు. వీరి గురించి ఇక్కడ తెలుసుకోండి. -
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల్లో అప్రమత్తంగా
స్టాక్ మార్కెట్ అంటేనే అనిశ్చితికి మారు పేరు. చిన్న వార్త వచ్చినా దానికి ప్రతికూలంగానో, అనుకూలంగానో స్పందిస్తుంటాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతుంది. -
స్థిరాస్తి రంగంలో...
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా హెచ్డీఎఫ్సీ నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ఈ నెల 21న ముగుస్తుంది. -
Health Insurance: విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధుల కోసం ఆరోగ్య బీమా
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య బీమా తప్పనిసరి. భారత్‌లో ప్రముఖ బీమా సంస్థలు విదేశీ విద్యార్థులకు అందించే బీమా సౌకర్యాలు ఇక్కడ తెలుసుకుందాం. -
Post office: ఈ పోస్టాఫీసు పథకంతో నెలకు ₹9 వేలు ఆదాయం
Monthly Income Scheme: ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం వచ్చే పథకం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ పోస్టాఫీసు పథకంపై లుక్కేయండి... -
Personal Finance: మీ వ్యక్తిగత ఆర్థిక ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలి?
జీవితంలో వివిధ దశలలో అవసరాలను తీర్చుకోగలిగే విధంగా ఆర్థిక ప్రయాణాన్ని కొనసాగించడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇక్కడ చూడండి.. -
Insurance: బీమా సంస్థలందించే వివిధ పాలసీలు ఇవిగో..
నేడు మార్కెట్లో అనేక నష్టాలను కవర్ చేసే బీమా పథకాలు ఉన్నాయి. చాలా బీమా పాలసీలను వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బీమా సంస్థలు తీర్చిదిద్దాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన పథకాల గురించి ఇక్కడ తెలుసుకోండి. -
Money mistakes: కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ ఆర్థిక తప్పులు చేయొద్దు!
Money mistakes: కొత్తగా ఉద్యోగంలో చేరినవారు ఆర్థికంగా ఎదగడానికి కొన్ని తప్పులను నివారించాలి. అవేంటో చూద్దాం..! -
ఆర్థిక స్వేచ్ఛ సాధించేద్దాం
భారతీయ మహిళలు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారు. అవిశ్రాంతంగా శ్రమిస్తూ.. మెరుగైన భవిష్యత్తును సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా, ప్రజల జీవితాలపైనా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. -
మ్యూచువల్ ఫండ్లు ఒకే రంగంలో మదుపు చేయాలంటే...
ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగమూ కీలక భూమిక పోషిస్తుంది. కొన్నిసార్లు కొన్ని రంగాలు వృద్ధి పథంలో దూసుకెళ్తుంటాయి. కాలం గడుస్తున్న కొద్దీ వాటి స్థానంలోకి కొత్తవి వస్తుంటాయి. భవిష్యత్తులో మంచి పనితీరు చూపిస్తాయనుకునే రంగాల్లో మదుపు చేసి, లాభాలు ఆర్జించే వ్యూహంతో వచ్చినవే థీమ్యాటిక్ ఫండ్లు. -
ప్రభుత్వ హామీ పథకాల్లో
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ తరగతికి చెందిన ఒక ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ పథకాన్ని ఆవిష్కరించింది. ‘యాక్సిస్ క్రిసిల్ ఐబీఎక్స్ ఎస్డీఎల్ జూన్ 2034 డెట్ ఇండెక్స్ ఫండ్’ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 12న ముగుస్తుంది. -
పీపీఎఫ్, SSY కడుతున్నారా? కనీస మొత్తం జమ చేయడానికి డెడ్‌లైన్ ఇదే..!
పీపీఎఫ్, ఎస్ఎస్వై వంటి ప్రభుత్వ పథకాల్లో మార్చి 31లోగా కనీస మొత్తాన్ని జమ చేయకపోతే ఆ ఖాతాలు స్తంభించిపోతాయి.
తాజా వార్తలు (Latest News)
-
గవర్నర్ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
-
ప్రవీణ్‌ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
-
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
-
డీఎస్పీలొస్తుంటారు.. పోతుంటారు ఆ కంత్రీ కానిస్టేబుళ్లు లోకల్