వాహన పరిశ్రమల్లో పెట్టుబడి...

దేశీయ మ్యూచువల్‌ ఫండ్లలో తొలి నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ ఫండ్‌ను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ ఫండ్‌’ పేరుతో ఆవిష్కరించింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ ఆధారంగా ఈ పథకం పోర్ట్‌ఫోలియో నిర్మిస్తారు

Updated : 23 Sep 2022 05:55 IST

దేశీయ మ్యూచువల్‌ ఫండ్లలో తొలి నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ ఫండ్‌ను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ ఫండ్‌’ పేరుతో ఆవిష్కరించింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ ఆధారంగా ఈ పథకం పోర్ట్‌ఫోలియో నిర్మిస్తారు. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ముగింపు తేదీ వచ్చే నెల 6. కనీస పెట్టుబడి రూ.1,000. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ గత పదేళ్ల కాలంలో 14 శాతం వార్షిక ప్రతిఫలాన్ని అందించింది. మన ఆటోమొబైల్‌ పరిశ్రమ 2030 నాటికి ప్రపంచంలో మూడో స్థానంలో నిలుస్తుందని అంచనా. ఆటోమొబైల్‌ విడి భాగాలకు మన దేశం కేంద్ర స్థానంగా మారుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం, పరిశ్రమ చొరవ కారణంగా విద్యుత్‌ వాహనాల శకం మొదలై, వేగంగా విస్తరించడానికి రంగం సిద్ధం అవుతోంది. ఈ పరిస్థితుల్లో వాహన పరిశ్రమల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని, ఈ క్రమంలో ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలు లభిస్తాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ విశ్వసిస్తోంది. దీనికి అనుగుణంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీర్ఘకాలిక వ్యూహంతో ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.


మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీల్లో..

ఒకేసారి రెండు సూచీ పథకాలను ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. ఇందులో ఒకటి ఎస్‌బీఐ నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ 150 ఇండెక్స్‌ ఫండ్‌. మరోటి ఎస్‌బీఐ నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ 250 ఇండెక్స్‌ ఫండ్‌. ఈ రెండూ ఇండెక్స్‌ పథకాలే కావడం ప్రత్యేకత. రెండు పథకాల ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 26. ఈ పథకాల్లో కనీస పెట్టుబడి రూ.5,000. వీటికి హర్స్‌ సేథీ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. ఇండెక్స్‌లో భాగంగా ఉన్న స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ తరగతికి చెందిన షేర్లపై పెట్టుబడి పెట్టి, దీర్ఘకాలంలో తక్కువ రిస్కుతో, అధిక ప్రతిఫలాన్ని ఆశించే మదుపరులు వీటిని పరిశీలించవచ్చు. ముఖ్యంగా తొలిసారి ఈక్విటీ పెట్టుబడులు పెడుతున్న వారికి ఇవి అనువుగా ఉంటాయని ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ వర్గాల విశ్లేషణ. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ తరగతికి చెందిన కొన్ని కంపెనీలు భవిష్యత్తులో లార్జ్‌ క్యాప్‌ కంపెనీలుగా మారి, పెద్ద ఎత్తున సంపద సృష్టించే అవకాశం ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ పథకాలు దీర్ఘకాలంలో ఆకర్షణీయమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని