టర్మ్‌ పాలసీ.. నచ్చినట్లుగా..

పాలసీదారుడు తన అవసరాలకు తగ్గట్టుగా టర్మ్‌ పాలసీని ఎంచుకునే వీలు కల్పిస్తూ సరికొత్త పాలసీని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ అందుబాటులోకి తెచ్చింది. ఈ క్లిక్‌2ప్రొటెక్ట్‌ సూపర్‌ పాలసీలో అవసరమైనప్పుడు బీమా మొత్తం మార్చుకోవచ్చు. వ్యవధిని పెంచుకోవచ్చు.

Published : 30 Sep 2022 00:35 IST

పాలసీదారుడు తన అవసరాలకు తగ్గట్టుగా టర్మ్‌ పాలసీని ఎంచుకునే వీలు కల్పిస్తూ సరికొత్త పాలసీని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ అందుబాటులోకి తెచ్చింది. ఈ క్లిక్‌2ప్రొటెక్ట్‌ సూపర్‌ పాలసీలో అవసరమైనప్పుడు బీమా మొత్తం మార్చుకోవచ్చు. వ్యవధిని పెంచుకోవచ్చు. ప్రమాదంలో మరణం, టెర్మినల్‌ ఇల్‌నెస్‌ తదితర సందర్భాల్లోనూ బీమా రక్షణ కల్పిస్తుంది. ఇందులో లైఫ్‌, లైఫ్‌ ప్లస్‌, లైఫ్‌ గోల్‌ అనే మూడు ఆప్షన్లు ఉన్నాయి. లైఫ్‌ ఆప్షన్‌లో పాలసీ విలువను 200 శాతం వరకూ పెంచుకునే వీలు, తీవ్ర వ్యాధులు సంక్రమించినప్పుడు ప్రీమియం రద్దు, జీవిత భాగస్వామి కోసం అదనపు రక్షణ, ప్రీమియం వాపసులాంటివి ఉంటాయి. స్మార్ట్‌ ఎగ్జిట్‌ ఆప్షన్‌లో భాగంగా మధ్యలోనే పాలసీ నుంచి నిష్క్రమిస్తే చెల్లించిన ప్రాథమిక ప్రీమియాన్ని తిరిగి చెల్లిస్తుంది. శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు ప్రీమియం రద్దువంటివి ఇందులో ఉన్నాయి. లైఫ్‌ ప్లస్‌లో లైఫ్‌ ఆప్షన్‌లో ఉండే ప్రయోజనాలతోపాటు అదనంగా ప్రమాదవశాత్తూ మరణించినా పరిహారం లభించే ఏర్పాటు ఉంది. లైఫ్‌ గోల్‌ ఎంచుకున్నప్పుడు.. పాలసీదారుడికి ఏదైనా జరిగినప్పుడు నామినీకి పరిహారాన్ని వాయిదాల్లో అందిస్తారు. దీనివల్ల కుటుంబానికి క్రమంగా ఆదాయం వచ్చే ఏర్పాటు చేయొచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని