స్థిరమైన ప్రతిఫలం కోసం...

ఎడిల్‌వైజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒకేసారి మూడు కొత్త పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇవన్నీ ‘ప్యాసివ్‌ ఇండెక్స్‌’ పథకాలే.

Updated : 11 Nov 2022 01:14 IST

డిల్‌వైజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒకేసారి మూడు కొత్త పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇవన్నీ ‘ప్యాసివ్‌ ఇండెక్స్‌’ పథకాలే. ఎడిల్‌వైజ్‌ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 మొమెంటమ్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌, ఎడిల్‌వైజ్‌ నిఫ్టీ నెక్స్ట్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌, ఎడిల్‌వైజ్‌ నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ 250 ఇండెక్స్‌ ఫండ్‌ ఇందులో ఉన్నాయి. మూడు పథకాల ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ఈ నెల 24న ముగుస్తుంది. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకాల ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటం ‘ప్యాసివ్‌ ఇండెక్స్‌’ పథకాల్లో ఉన్న సానుకూలద. ఎడిల్‌వైజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించిన మూడు కొత్త పథకాలకూ ఇది వర్తిస్తుంది. ఎడిల్‌వైజ్‌ నిఫ్టీ నెక్స్ట్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌... నిఫ్టీ నెక్స్ట్‌ 50 ఇండెక్స్‌ షేర్లపై పెట్టుబడి పెడుతుంది. మిగిలిన రెండు పథకాల పెట్టుబడుల తీరూ ఇదే విధంగా ఉంటుంది. సంబంధిత నిఫ్టీ సూచీలోని కంపెనీలపై పెట్టుబడులను కేంద్రీకరిస్తాయి. తక్కువ రిస్కుతో, స్థిరమైన ప్రతిఫలాన్ని కోరుకునేవారికి ఇవి అనువుగా ఉంటాయి. స్మాల్‌ క్యాప్‌ పథకాలకు కేటాయించినట్లు అవుతుంది. ఈ ఆలోచన ఉన్నవారు ఈ పథకాలను పరిశీలించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని