అప్పుల భారం వదిలించుకోండి..
ఒకప్పుడు అప్పు దొరకడం చాలా కష్టం. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అడిగిన వెంటనే క్షణాల్లో బ్యాంకు ఖాతాలో రుణమొత్తం జమ అవుతోంది. ఏదైనా కొనాలన్నా డబ్బుతో అవసరం లేకుండా వాయిదాల్లో చెల్లించే ఏర్పాటు ఉంది.
ఒకప్పుడు అప్పు దొరకడం చాలా కష్టం. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అడిగిన వెంటనే క్షణాల్లో బ్యాంకు ఖాతాలో రుణమొత్తం జమ అవుతోంది. ఏదైనా కొనాలన్నా డబ్బుతో అవసరం లేకుండా వాయిదాల్లో చెల్లించే ఏర్పాటు ఉంది. పండగల వేళ ఎంతోమంది ఈ వెసులుబాట్లనే ఉపయోగించుకున్నారు. ఇలా చేసిన అప్పులను వీలైనంత తొందరగా వదిలించుకునే ప్రయత్నం చేస్తేనే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవ్వవు.
* పండగల వేళ ఎంత ఖర్చు చేశారో ముందుగా లెక్క తీయండి. ఇందులో మీ పొదుపు మొత్తం ఎంత? రుణం ఎంత తీసుకున్నారో చూసుకోండి. ఏయే అప్పులకు ఎంత వ్యవధి ఉంది, వడ్డీ ఎంత చెల్లిస్తున్నారు పరిశీలించండి. ముఖ్యంగా వ్యక్తిగత, ఇప్పుడు కొనండి-తర్వాత చెల్లించండి (బీఎన్‌పీఎల్) రుణాలను చూసుకోండి. పాత, కొత్త రుణాలను ఒక చోట రాసి పెట్టుకోండి. అప్పుడే మీకు రుణాల విషయంలో ఒక స్పష్టత వస్తుంది. ఇప్పుడు మీ ఆదాయం, అందులో మిగిలే మొత్తంతో ఆయా అప్పులను ఎలా తీర్చాలని అనుకుంటున్నారో ప్రణాళిక వేసుకోండి.
* ముందస్తుగా తీర్చేందుకు వీలున్న అప్పులను గుర్తించండి. అధిక వడ్డీ ఉన్న రుణాలను సాధ్యమైనంత వేగంగా వదిలించుకోవాలి. లేకుంటే మీ పొదుపు మొత్తాన్ని అధికభాగం ఇవే తినేస్తాయి. చిన్న రుణాలనూ చెల్లించేందుకు ప్రయత్నించండి. వీటివల్ల ఎక్కువ రుణాలు ఉన్నట్లు అనిపిస్తుంది. ముందస్తు చెల్లింపుల వల్ల రుసుముల భారం ఏ మేరకు ఉంటుందో చూసుకోవాలి.
* తక్కువ రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. 8 శాతం రాబడి ఆర్జించే పథకాలో పొదుపు కొనసాగిస్తూ, 16 శాతం వడ్డీకి రుణాలను తీసుకోవడం భావ్యం కాదు. వీలైతే ఎఫ్డీలు, జీవిత బీమా పాలసీలపై రుణాలను తీసుకోండి. దీనివల్ల తక్కువ వడ్డీకి రుణం దొరుకుతుంది. బంగారాన్ని హామీగా ఉంచి అప్పు తీసుకున్నా తక్కువ వడ్డీ వర్తిస్తుంది.
ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషించండి. దీనివల్ల తొందరగా రుణాలను తీర్చే మార్గం దొరుకుతుంది. కుటుంబ సభ్యులతో ఈ విషయంపై చర్చించండి. ఆదాయ-అప్పుల నిష్పత్తి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే ఉన్న గృహరుణం ఈఎంఐ తగ్గించుకునే అవకాశం ఉందా అనేది బ్యాంకుతో చర్చించండి.
పండగల వేళ ఆనందంగా కొనుగోళ్లు చేసినా, ఆ అప్పులను వీలైనంత తొందరగా తీర్చినప్పుడే అది రెట్టింపు అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని రుణాలను తీర్చే ప్రణాళికలను వెంటనే అమలు చేయండి.
* ఇప్పటికే చేసిన అప్పులను తీర్చే వరకూ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. లేకపోతే.. ఆర్థికంగా చిక్కులు తప్పవు. అనవసర, విలాస వ్యయాలను నియంత్రించుకోవాలి. కొన్నాళ్లపాటు తక్కువ మొత్తంతోనే జీవించే అలవాటు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త రుణాలు, క్రెడిట్ కార్డుతో కొనుగోళ్ల జోలికి పోవద్దు. అవసరమైతే కొన్నాళ్లపాటు కార్డును ఫ్రీజ్ చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
PPF vs VPF: పీపీఎఫ్, వీపీఎఫ్‌లో ఏది బెటర్..?
PPF or VPF: వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాల్ని పరిశీలించాక మీ నిర్ణయం తీసుకోండి.. -
Foreign Trip: విదేశీ టూర్‌ను ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి?
విదేశీ వెకేషన్‌ను ప్లాన్ చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం ఇబ్బంది లేకుండా, సజావుగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. -
Claim Ratio: ఆరోగ్య బీమా కంపెనీల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో వివిధ బీమా సంస్థలకు సంబంధించి.. ఆరోగ్య బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
పన్ను ఆదా ఇలా చేద్దాం
ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వచ్చేసింది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు తమ పొదుపు,పెట్టుబడులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. -
డెట్ ఫండ్లలో మదుపు చేస్తున్నారా?
ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తుండటంతో చాలామంది సురక్షిత పథకాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిలో మదుపు చేసేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలను తెలుసుకుందాం. -
Credit cards: క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!
Credit Cards: క్రెడిట్ కార్డుల విషయంలో ఏప్రిల్ 1 నుంచి మార్పులు రానున్నాయి. రివార్డులు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో బ్యాంకులు కీలక మార్పులు చేపట్టాయి. -
Health Insurance Claims: ఆరోగ్య బీమా క్లెయిమ్ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!
Insurance claims: ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు కొన్నిసార్లు తిరస్కరణకు గురవుతుంటాయి. కాబట్టి ఈ తప్పులు చేయొద్దు.. -
Health Emergency: ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి?
జీవితంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కోడానికి మనం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి.. -
Mutual Funds: మ్యూచువల్ ఫండ్ల ఉపసంహరణ సమస్య.. ఎన్ని రోజులు పడుతోందంటే?
మార్కెట్లలో మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్లలో ఉన్న తమ నిధులను మదుపుదార్లు ఉపసంహరించుకున్నప్పుడు నిధుల బదిలీకి వివిధ సంస్థలు కొంత సమయాన్ని తీసుకుంటున్నాయి. ఎంత మొత్తం ఉపసంహరణకు.. ఎంత సమయం తీసుకుంటున్నాయో ఇక్కడ చూడండి. -
Insurance Agent: బీమా ఏజెంట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి?
చాలా మందికి వారి వ్యక్తిగత జీవితంలో బీమా చాలా అవసరం. పాలసీ కొనుగోలు సమయంలో ఏజెంట్/అడ్వైజర్ అవసరం పడొచ్చు. వీరి గురించి ఇక్కడ తెలుసుకోండి. -
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల్లో అప్రమత్తంగా
స్టాక్ మార్కెట్ అంటేనే అనిశ్చితికి మారు పేరు. చిన్న వార్త వచ్చినా దానికి ప్రతికూలంగానో, అనుకూలంగానో స్పందిస్తుంటాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతుంది. -
స్థిరాస్తి రంగంలో...
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా హెచ్డీఎఫ్సీ నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ఈ నెల 21న ముగుస్తుంది. -
Health Insurance: విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధుల కోసం ఆరోగ్య బీమా
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య బీమా తప్పనిసరి. భారత్‌లో ప్రముఖ బీమా సంస్థలు విదేశీ విద్యార్థులకు అందించే బీమా సౌకర్యాలు ఇక్కడ తెలుసుకుందాం. -
Post office: ఈ పోస్టాఫీసు పథకంతో నెలకు ₹9 వేలు ఆదాయం
Monthly Income Scheme: ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం వచ్చే పథకం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ పోస్టాఫీసు పథకంపై లుక్కేయండి... -
Personal Finance: మీ వ్యక్తిగత ఆర్థిక ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలి?
జీవితంలో వివిధ దశలలో అవసరాలను తీర్చుకోగలిగే విధంగా ఆర్థిక ప్రయాణాన్ని కొనసాగించడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇక్కడ చూడండి.. -
Insurance: బీమా సంస్థలందించే వివిధ పాలసీలు ఇవిగో..
నేడు మార్కెట్లో అనేక నష్టాలను కవర్ చేసే బీమా పథకాలు ఉన్నాయి. చాలా బీమా పాలసీలను వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బీమా సంస్థలు తీర్చిదిద్దాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన పథకాల గురించి ఇక్కడ తెలుసుకోండి. -
Money mistakes: కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ ఆర్థిక తప్పులు చేయొద్దు!
Money mistakes: కొత్తగా ఉద్యోగంలో చేరినవారు ఆర్థికంగా ఎదగడానికి కొన్ని తప్పులను నివారించాలి. అవేంటో చూద్దాం..! -
ఆర్థిక స్వేచ్ఛ సాధించేద్దాం
భారతీయ మహిళలు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారు. అవిశ్రాంతంగా శ్రమిస్తూ.. మెరుగైన భవిష్యత్తును సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా, ప్రజల జీవితాలపైనా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. -
మ్యూచువల్ ఫండ్లు ఒకే రంగంలో మదుపు చేయాలంటే...
ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగమూ కీలక భూమిక పోషిస్తుంది. కొన్నిసార్లు కొన్ని రంగాలు వృద్ధి పథంలో దూసుకెళ్తుంటాయి. కాలం గడుస్తున్న కొద్దీ వాటి స్థానంలోకి కొత్తవి వస్తుంటాయి. భవిష్యత్తులో మంచి పనితీరు చూపిస్తాయనుకునే రంగాల్లో మదుపు చేసి, లాభాలు ఆర్జించే వ్యూహంతో వచ్చినవే థీమ్యాటిక్ ఫండ్లు. -
ప్రభుత్వ హామీ పథకాల్లో
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ తరగతికి చెందిన ఒక ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ పథకాన్ని ఆవిష్కరించింది. ‘యాక్సిస్ క్రిసిల్ ఐబీఎక్స్ ఎస్డీఎల్ జూన్ 2034 డెట్ ఇండెక్స్ ఫండ్’ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 12న ముగుస్తుంది. -
పీపీఎఫ్, SSY కడుతున్నారా? కనీస మొత్తం జమ చేయడానికి డెడ్‌లైన్ ఇదే..!
పీపీఎఫ్, ఎస్ఎస్వై వంటి ప్రభుత్వ పథకాల్లో మార్చి 31లోగా కనీస మొత్తాన్ని జమ చేయకపోతే ఆ ఖాతాలు స్తంభించిపోతాయి.
తాజా వార్తలు (Latest News)
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
-
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్ షాక్!