వెండి కొనేవారి కోసం

వెండిలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కల్పించనుంది. దీనికి అనువుగా ఒక సిల్వర్‌ ఈటీఎఫ్‌ పథకాన్ని తీసుకొచ్చింది.

Published : 25 Nov 2022 00:10 IST

వెండిలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కల్పించనుంది. దీనికి అనువుగా ఒక సిల్వర్‌ ఈటీఎఫ్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ నూతన మ్యూచువల్‌ ఫండ్‌ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 5. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ఈ పథకానికి జీతు వలేఛా సోనార్‌, అభిషేర్‌ బిసేన్‌ ఫండ్‌ మేనేజర్లు.

ఈ పథకం కింద సమీకరించిన సొమ్మును వెండి, వెండి ఈటీఎఫ్‌ యూనిట్లు, వెండి ఆధారిత పత్రాల్లో పెట్టుబడిగా పెడతారు. దాదాపు 5 శాతం వరకూ సొమ్మును రుణ పత్రాలకు కేటాయించే అవకాశం ఉంది. వెండిపై నేరుగా పెట్టుబడి పెడితే ఏమేరకు లాభాలు వస్తాయో, కనీసం ఆ స్థాయి లాభాలను సాధించాలనేది ఈ పథకం ప్రధాన లక్ష్యం. తమ పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండాలని కోరుకుంటూ, కొంత సొమ్మును వెండికి కేటాయించాలని ఆశించే మదుపరులకు ఇటువంటి పథకాలు అనువుగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని