ఆదాయపు పన్ను భారం తగ్గాలి..సంపద పెరగాలి...
మరో నాలుగు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. పన్ను భారం తగ్గించుకునేందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టాల్సిన తరుణమిది. పన్ను మినహాయింపు ఒక్కటే లక్ష్యం కాకుండా.. పెట్టుబడులు భవిష్యత్తులో ఆర్థిక భరోసా కల్పించేలా ఉండాలి.
మరో నాలుగు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. పన్ను భారం తగ్గించుకునేందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టాల్సిన తరుణమిది. పన్ను మినహాయింపు ఒక్కటే లక్ష్యం కాకుండా.. పెట్టుబడులు భవిష్యత్తులో ఆర్థిక భరోసా కల్పించేలా ఉండాలి. సరైన పన్ను-పెట్టుబడి పథకంలో మదుపు చేసినప్పుడే ఇది సాధ్యం.
పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు పన్ను చెల్లించాలి. ఈ భారాన్ని తగ్గించేందుకు ఆదాయపు పన్ను చట్టం 1961 పలు మార్గాలనూ సూచిస్తోంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సెక్షన్ 80సీ. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 వరకూ వివిధ పథకాల్లో మదుపు చేయడం ద్వారా పన్ను మినహాయింపు పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్), అయిదేళ్ల పన్ను ఆదా బ్యాంకు డిపాజిట్లు, జీవిత బీమా పాలసీల ప్రీమియం, ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్), జాతీయ పొదుపు పత్రాలు (ఎన్ఎస్సీ), పెద్దల పొదుపు పథకం (ఎస్సీఎస్ఎస్), ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్ఎస్ఎస్), గృహరుణం అసలు, ఇద్దరు పిల్లలకు చెల్లించిన ట్యూషన్ ఫీజు తదితరాలు ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి.
కొన్ని పథకాలు స్థిరంగా రాబడిని అందిస్తాయి. కానీ, దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణంతో పోల్చి చూసినప్పుడు అది అంత గొప్పగా ఉండదు. పైగా వీటి నుంచి వచ్చిన రాబడిపైనా పన్ను చెల్లించాల్సి వస్తుంది.
మార్కెట్ ఆధారిత పన్ను ఆదా పథకాలను ఎంచుకున్నప్పుడు కాస్త నష్టభయం ఉంటుందన్నది వాస్తవం. ఇందులో ముఖ్యంగా ఈఎల్ఎస్ఎస్, యూనిట్ ఆధారిత బీమా పాలసీలు (యులిప్), జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లాంటివి పరిశీలించవచ్చు. దీర్ఘకాలంలో వీటి వల్ల పెట్టుబడి వృద్ధికి అవకాశం ఉంటుంది. వచ్చిన రాబడిపైనా పన్ను భారం అంతగా ఉండదు.
మూడేళ్లు కొనసాగిస్తే...
మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తూ.. పన్ను ఆదా చేసుకునేందుకూ వీలుండాలనుకునే వారు ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్ఎస్ఎస్) ఎంచుకోవచ్చు. వీటిలో పెట్టుబడిని కనీసం మూడేళ్లపాటు కొనసాగించాలనేది నిబంధన. సెక్షన్ 80సీ పెట్టుబడుల్లో తక్కువ వ్యవధి ఉన్నవి ఇవే. కొత్తగా ఉద్యోగంలో చేరి, ఫండ్లలో తొలిసారి మదుపు చేస్తున్న వారికి ఇవి అనుకూలం.
* ఒకే ఈఎల్ఎస్ఎస్ను ఎంచుకునే బదులు.. మంచి పనితీరున్న మూడు నాలుగు పథకాల్లో మదుపు చేయొచ్చు. దీనివల్ల వైవిధ్యంగా మదుపు చేసేందుకు అవకాశం కలుగుతుంది. స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ షేర్లలో మదుపు చేసే ఫండ్లను పరిశీలించండి.
* ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే 2-3 ఫండ్లను ఎంచుకొని, క్రమానుగతంగా మదుపు (సిప్) చేయాలి. ప్రతి సిప్ మొత్తానికీ మూడేళ్ల లాకిన్ వర్తిస్తుంది.
* మూడేళ్ల వరకూ పెట్టుబడిని కొనసాగించాలన్న నిబంధన వల్ల మీరు మధ్యలోనే వెనక్కి తీసుకోవాలన్న ఆలోచన ఉండదు. ఫలితంగా పెట్టుబడి వృద్ధికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. మూడేళ్ల వ్యవధి ముగుస్తున్నప్పుడు ఫండ్ పనితీరును పరిశీలించండి. బాగుంటే మొదటి నెలలో మదుపు చేసిన మొత్తాన్ని వెనక్కి తీసుకొని, తిరిగి పెట్టుబడి పెట్టండి. ఇలా చేయడం వల్ల కొత్తగా మీరు చేతి నుంచి డబ్బు పెట్టాల్సిన అవసరం ఉండదు. వెసులుబాటు లేనప్పుడే దీన్ని ఉపయోగించుకోవాలి. మీ దగ్గర మిగులు మొత్తం ఉంటే మదుపును క్రమం తప్పకుండా కొనసాగించడమే లాభదాయకం.
బీమా తోడుగా...
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, బీమా రక్షణ ఒకేచోట అందించేవి యూనిట్ ఆధారిత బీమా పాలసీలు (యులిప్). పెట్టుబడి, రక్షణ విడివిడిగా నిర్వహించలేని వారికి ఇవి అనుకూలం. సాధారణంగా ఇవి 15-20 ఏళ్ల దీర్ఘకాలిక పథకాలు. మీ వయసు, ఎంత ప్రీమియం చెల్లించగలరు, వ్యవధి, వివిధ దశల్లో మీ అవసరాలు, తదితర వాటిని దృష్టిలో పెట్టుకొని, వీటిని ఎంపిక చేసుకోవాలి.
* మీరు చెల్లించే ప్రీమియానికి కనీసం 10 రెట్ల వరకూ బీమా పాలసీ ఉండేలా చూసుకోవాలి. 15-20 రెట్లు ఉంటే మరీ మంచిది.
* వివిధ లక్ష్యాలకు అనుగుణంగా.. దీర్ఘకాలిక యులిప్ ఎప్పుడూ మంచిది. పాలసీ వ్యవధి ముగిసే వరకూ ప్రీమియం చెల్లించాలి. చాలా యులిప్‌లు ఈక్విటీ, డెట్ ఫండ్లను ఎంచుకునేందుకు దాదాపు 5-9 ఫండ్లు అందుబాటులో ఉంటాయి. మీ లక్ష్యాలకు అనుగుణంగా వీటిని పరిశీలించవచ్చు. ఇందులో కొన్ని స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ ఫండ్లు ఉంటాయి. కొన్నింటిలో మల్టీ క్యాప్, థీమాటిక్ ఫండ్లూ అందుబాటులో ఉంటాయి. మీ నష్టభయాన్ని భరించే సామర్థ్యాన్ని బట్టి, ఫండ్లను ఎంపిక చేసుకోవాలి. ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు మారేందుకు కొన్ని నిబంధనలకు లోబడి ‘స్విచ్చింగ్’ అవకాశం ఉంటుంది.
* కనీసం 10-15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించేందుకు ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే యులిప్‌లను తీసుకోండి. పెట్టుబడుల్లో డైవర్సిఫైడ్ ఫండ్లకే ప్రాధాన్యం ఇవ్వండి. లక్ష్యం సమీపిస్తున్నప్పుడు ఈక్విటీ ఫండ్ల నుంచి పెట్టుబడిని డెట్ ఫండ్లలోకి మార్చండి. అయిదేళ్ల తర్వాత పాక్షికంగా కొంత పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, సాధ్యమైనంత వరకూ ఈ వెసులుబాటును వాడుకోవద్దు.
పింఛను పథకంతో..
పన్ను ఆదాతోపాటు, పదవీ విరమణ తర్వాతా ఉపయోగపడాలి అనుకున్నప్పుడు జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) మంచి ఎంపిక. ఈ పథకాన్ని పింఛన్ నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రిస్తుంది. ఈ పథకంలో ముందుగా పెట్టుబడి పెడితే.. పదవీ విరమణ తర్వాత పింఛను తీసుకునేందుకు వీలవుతుందన్న మాట. ఎంత పింఛను వస్తుందనేది పెట్టుబడి మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక రకంగా మార్కెట్ ఆధారిత పథకమే. కాబట్టి, రాబడికి కచ్చితమైన హామీ అంటూ ఏమీ ఉండదు. కాకపోతే.. ఇతర పింఛను పథకాలతో పోలిస్తే ఎన్పీఎస్ ఖర్చుల నిష్పత్తి తక్కువగా ఉంటుంది.
* పదవీ విరమణ వరకూ జమ చేసిన మొత్తంలో నుంచి 60 శాతం వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40 శాతంతో ఎంపిక చేసిన ఏడు సంస్థల నుంచి యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవే పింఛనును చెల్లిస్తాయి.
* యాక్టివ్ ఛాయిస్, ఆటో ఛాయిస్ పేరుతో ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వయసు, నష్టభయాన్ని భరించే శక్తిని బట్టి, వీటిని ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ, స్థిరాదాయం అందించే పథకాలు, ప్రభుత్వ సెక్యూరిటీలు ప్రధానంగా ఉంటాయి.
* ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద రూ.50వేల వరకూ ప్రత్యేక మినహాయింపు పొందేందుకు వీలుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్‌లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది. -
టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి. -
రెగ్యులర్ Vs డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్.. ఏది బెటర్?
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో మదుపర్లకు రెండు రకాల పథకాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు. -
వివిధ లార్జ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఇలా ఉన్నాయి
3, 5, 10 సంవత్సరాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇక్కడ ఉన్నాయి. -
స్థిరాస్తుల్లో మదుపు చేద్దామా
పెట్టుబడులు పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. షేర్లు, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలాంటి పెట్టుబడి పథకాలు, బంగారం, స్థిరాస్తుల వరకూ ఎన్నో విస్తృత శ్రేణి ఎంపికలు ఉన్నాయి. -
ఓటీపీ ఆ అంకెలు జాగ్రత్త
ఒక్క క్లిక్‌తో కావాల్సినవన్నీ కొనేస్తున్నాం. బ్యాంకింగ్ లావాదేవీలన్నీ చేసేస్తున్నాం. వీటన్నింటికీ ఆరంకెల ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) చాలు.. ఇంత సౌలభ్యంతోపాటు, కొన్ని ప్రమాదాలూ పొంచి ఉన్నాయి
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్‌హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)